వన్ ప్లస్ 10ఆర్ 5జి డిస్‌ప్లేకు సంబంధించి, అడాప్టివ్ ఫ్రేమ్ రేట్‌కి 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ డిస్‌ప్లే లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది, అంటే మీరు దానికి అనుగుణంగా రిఫ్రెష్ రేట్‌ను సెట్ చేయవచ్చు.
వన్ ప్లస్ (OnePlus)భారతీయ మార్కెట్లో వన్ ప్లస్ 10ఆర్ 5జి (OnePlus 10R 5G)ని ఏప్రిల్ 28న లాంచ్ చేయబోతోంది. దీనితో పాటు వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite), కంపెనీ కొత్త ఇయర్‌బడ్‌లు కూడా వన్ ప్లస్ 10ఆర్ 5జి (OnePlus 10R 5G)తో పాటు విడుదల చేయనుంది. అయితే వన్ ప్లస్ 10ఆర్ 5జి ఫీచర్లు లాంచ్ ముందే లీక్ అయ్యాయి. నివేదిక ప్రకారం, వన్ ప్లస్ 10ఆర్ 5జి 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ డిస్‌ప్లేతో రానుంది.
వన్ ప్లస్ నార్డ్ సిఈ 2 లైట్ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ లభిస్తుంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో ఈ ఫోన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా లభిస్తుంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది.
రెండు ఫోన్‌ల మైక్రోసైట్ OnePlus వెబ్‌సైట్‌లో చూడవచ్చు. OnePlus 10R 5G డిస్‌ప్లేకు సంబంధించి, అడాప్టివ్ ఫ్రేమ్ రేట్‌కు సపోర్ట్ తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ డిస్‌ప్లే లభిస్తుందని కంపెనీ ధృవీకరించింది, అంటే మీరు మీకు అనుగుణంగా రిఫ్రెష్ రేట్‌ను సెట్ చేయవచ్చు. హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజన్ ఫోన్‌తో వస్తుంది. OnePlus 10R 5Gతో 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, దీని ద్వారా 17 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది.
OnePlus Nord CE 2 Lite మూడు బ్యాక్ కెమెరాలను పొందుతుంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని పొందుతుంది. ఓషన్ బ్లూ కలర్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
MediaTek డైమెన్సిటీ 8100-MAX ప్రాసెసర్ OnePlus 10R 5Gలో అందించారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. OnePlus 10R 5Gలో 4500mAh బ్యాటరీ చూడవచ్చు. అలాగే రెండు వేరియంట్‌లలో ఇదే బ్యాటరీ అందించబడుతుంది, ఒకటి 150W ఛార్జింగ్ అండ్ మరొకటి 80W ఛార్జింగ్. కొత్త ఫోన్ ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన Realme GT Neo 3కి అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెబుతున్నారు.
OnePlus Nord CE 2 Lite 5G 6.59-అంగుళాల డిస్‌ప్లే పొందుతుంది. OnePlus ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ని ఇచ్చారు, దీనితో 8జిబి ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. 256జిబి వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు. 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో చూడవచ్చు.