వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది. మార్చి 31వ తేదీన ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లోకి లాంఛ్ కానుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో వన్ ప్లస్ 10 సిరీస్ ఫోన్ లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది. భారత్‌లో OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్ ప్రారంభ తేదీని అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాదిలో వన్ ప్లస్ 9 ప్రో సక్సెస్ అయింది. ఇప్పుడు రాబోయే వన్‌ప్లస్ అడ్వాన్స్ వెర్షన్ Oneplus 10 Pro 5G ఫోన్ కూడా భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికాలో మార్చి 31న రాత్రి 7:30 PM అధికారికంగా లాంచ్ కానుంది.
అంతేకాదు.. టెక్ దిగ్గజం వన్‌ప్లస్ బడ్స్ ప్రో రేడియంట్ సిల్వర్ (Buds Pro Radiant Silver)ను మూడు మార్కెట్‌లలో లాంచ్ చేస్తోంది. OnePlus 10 Pro లాంచ్ ఈవెంట్ అధికారిక వెబ్‌సైట్ YouTube ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు భారత్ మార్కెట్ భారీగా డిమాండ్ ఉంటుంది. అందుకే భారతీయ వినియోగదారుల కోసం OnePlus Bullets Wireless Z2ని ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. అధికారికంగా OnePlus Bullets Wireless Z2 కు సంబంధించి కొన్ని కీలక వివరాలను OnePlus వెల్లడించింది. ఈ మోడల్ ఫోన్‌లో వేగవంతమైన ఛార్జింగ్, బ్యాటరీ లైఫ్, మెరుగైన సౌండ్ క్వాలిటీ, పెద్ద డ్రైవర్లతో ఆకర్షణీయంగా ఉండనుంది.
OnePlus 10 ప్రో ఫీచర్లు, ధర ఎంతంటే..?
OnePlus 10 Pro ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. అయితే అదే స్మార్ట్ ఫోన్ వెర్షన్.. కొన్ని స్వల్ప మార్పులతో భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేయాలని OnePlus భావిస్తోంది. వన్ ప్లస్ 10ప్రో చైనీస్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్ 1,300 నిట్స్, 6.7-అంగుళాల QHD+ LTPO డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ కిందిభాగంలో ఫ్లాగ్‌షిప్ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ ద్వారా 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రానుంది. అలాగే 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది.
OnePlus 10 Pro కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. గత వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో మాదిరిగానే Hasselbladతో భాగస్వామ్యం కలిగి ఉంది. నిర్దిష్ట కెమెరా వివరాల విషయానికొస్తే.. OnePlus 10 Pro వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్, 48-MP Sony IMX789 సిరీస్, 50-MP Samsung ISOCELL JN1 సెన్సార్ 8-MP టెలిఫోటోను అందిస్తోంది. ఇక ఫొటో షూటర్.. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం వినియోగించుకోవచ్చు. వన్ ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 32-MP ఫ్రంట్ షూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. చైనాలోని వన్‌ప్లస్ 10ప్రో ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1పై రన్ అవుతుంది. ఈ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. గ్లోబల్ వెర్షన్‌కు సంబంధం ఉండదని కంపెనీ చెబుతోంది.
భారత మార్కెట్లో, ఇతర మార్కెట్లలో OnePlus 10 Pro ఆక్సిజన్ OSతో వస్తుంది. ధర పరంగా చూస్తే.. OnePlus 10 Pro చైనీస్ మోడల్ CNY 4,699 నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు భారత మార్కెట్లో OnePlus 10 ప్రో ధర రూ. 54,500 వరకు ఉండనుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అనేది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. అంతకుముందు మార్కెట్లోకి రిలీజ్ అయిన వన్‌ప్లస్ 9pro లాంచ్ ధరకు సమానంగా ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో OnePlus 9 Pro (8GB RAM +128GB) స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 64,999 వద్ద ఉండొచ్చునని మార్కెట్ విశ్లేషకుల అంచనా.