త్వరలో ఇండియాలోకి వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్‌వాచ్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్ ఇవే.. ధర ఎంతంటే ?

By asianet news telugu  |  First Published Mar 23, 2022, 2:37 PM IST

వన్ ప్లస్ నార్డ్ బ్రాండ్ క్రింద ఒక కొత్త స్మార్ట్‌వాచ్‌ ఇండియాలోకి రాబోతుంది. నివేదికల ప్రకారం, వన్ ప్లస్ 10 ప్రొ, వన్ ప్లస్ నార్డ్ సి‌ఈ 2 లైట్, వన్ ప్లస్ నార్డ్ 2టి,  నార్డ్ 3 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పాటు దీనిని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.


వన్ ప్లస్ నార్డ్ (OnePlus Nord) స్మార్ట్‌వాచ్ త్వరలో భారతీయ మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది. తాజాగా నివేదిక ప్రకారం ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ విడుదలతో పాటుగా ఉంటుందని భావిస్తున్నారు. చైనీస్ టెక్ బ్రాండ్ ఈ సంవత్సరం భారతదేశంలో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. OnePlus ఇప్పటికే భారతదేశంలో OnePlus 10 ప్రో విడుదలను టీజ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది.


బడ్జెట్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్‌ను చేపట్టేందుకు OnePlus Nord బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌పై పని చేస్తోందని ఒక నివేదిక సూచించింది. భారతదేశంలోని బడ్జెట్ స్మార్ట్‌వాచ్ విభాగంలో ప్రస్తుతం Xiaomi , Realme , Amazfit  ఇతర బ్రాండ్స్  ఆధిపత్యం చెలాయిస్తున్నారు. OnePlus Nord స్మార్ట్‌వాచ్ ధర పది వేల లోపు ఉండొచ్చని అంచనా. ఒక నివేదిక ప్రకారం దీని ధర చాలా వరకు రూ. 5,000 నుండి రూ. 8,000 పరిధిలో ఉండొచ్చు.

Latest Videos

undefined

OnePlus Nord స్మార్ట్‌వాచ్ కి కలర్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇంకా, ఈ బడ్జెట్ ఆఫర్‌లో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లు, మ్యూజిక్ కంట్రోల్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

గత సంవత్సరం వన్ ప్లస్ ( OnePlus) కంపెనీ మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ వన్ ప్లస్ వాచ్‌ను విడుదల చేసింది, అయితే ఈ వాచ్ టెక్ విమర్శకులు, అభిమానుల నుండి పెద్దగా ఆదరించబడలేదు. స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి OnePlus ఉత్పత్తులతో అతుకులు లేని కంపాటబిలిటీ మినహా, ఆక్టివిటీ ట్రాకింగ్ సామర్థ్యం బడ్జెట్ ఫిట్‌నెస్ బ్యాండ్‌తో సమానంగా ఉంటుంది

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్‌ వన్‌ప్లస్ త్వరలో నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌తో పాటు నార్డ్-బ్రాండెడ్ స్మార్ట్ వేరబుల్‌ను భారతదేశంలోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. Nord ఫోన్‌ల లాగానే రాబోయే నార్డ్ స్మార్ట్ వాచ్ వన్ ప్లస్ వాచ్‌తో పోలిస్తే సరసమైనదిగా ఉంటుంది.  ప్రస్తుతం, ఈ OnePlus Watch costs Rs 14,999.

OnePlus Nord స్మార్ట్‌వాచ్‌లో కలర్ టచ్ డిస్‌ప్లే, వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ కోటింగ్, యాక్టివిటీ ట్రాకింగ్, స్టెప్స్ కౌంట్, క్యాలరీ బర్న్ కౌంట్, స్లీప్ ప్యాటర్న్‌తో పాటు హార్ట్ రేట్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్) వంటి స్టాండర్డ్ బయోమెట్రిక్ వైటల్స్ ఉంటాయి.  అలాగే, OnePlus వాచ్ లాగానే రాబోయే Nord స్మార్ట్‌వాచ్ వాతావరణ వివరాలు, మెసేజ్ నోటిఫికేషన్‌లు, ఇన్‌కమింగ్ కాల్ వార్నింగ్స్ (రిజెక్ట్ ఆప్షన్ తో), మ్యూజిక్ కంట్రోల్, కెమెరా షట్టర్‌ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. వన్‌ప్లస్ ప్రీమియం వన్‌ప్లస్ 10 ప్రోను ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల చేయనుంది. 
 

click me!