UPI Auto pay:యూ‌పి‌ఐ ఆటో పే ఫీచర్ అంటే ఏమిటి ? దీంతో ప్రతినెల 2వేల వరకు..

By asianet news teluguFirst Published Jun 28, 2022, 10:52 AM IST
Highlights

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంతకాలం క్రితం UPI ఆటో పే ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు  వారి ప్రతినెల్ ఖర్చులను ఆటోమేటిక్ మోడ్‌లో చేయవచ్చు. 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూ‌పి‌ఐ ఆటో పే ఫీచర్‌ను ప్రమోట్ చేయడానికి  ప్రముఖ బాలీవుడ్ రాపర్ బాద్షాతో ఒప్పందం చేసుకుంది.  ఈ ప్రచారం కంపెనీ UPI చలేగా మిషన్‌కు సంబంధించినది. విరాట్ కోహ్లీ, రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దుల్కర్ సల్మాన్ ఈ మిషన్‌లో కనిపించారు.

UPI ఆటో పే ఫీచర్ అంటే ఏమిటి?

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంతకాలం క్రితం UPI ఆటో పే ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు  వారి ప్రతినెల్ ఖర్చులను ఆటోమేటిక్ మోడ్‌లో చేయవచ్చు. దీని కింద ప్రతి నెలా రూ.2,000 వరకు పేమెంట్స్ చేయవచ్చు. ఈ మొత్తం కంటే ఎక్కువ పేమెంట్ కోసం యూజర్లు UPI పిన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా వస్తువును కొనుగోలు చేయడానికి ప్రతి నెలా మీ అక్కౌంట్ నుండి కొంత మొత్తం ఎలా కట్ అవుతుందో అదే విధంగానే ఈ సిస్టమ్ పని చేస్తుంది. UPI  కొత్త ఫీచర్ ఆటో పే మొబైల్‌ రీఛార్జ్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి, రుణాలు, మెట్రో కార్డ్ చెల్లింపులకు, ఇన్షూరెన్స్ చెల్లించడానికి లేదా ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలను చేయడానికి ఉపయోగించవచ్చు. 

మీడియా నివేదికల ప్రకారం పాపులర్ సింగర్ బాద్షాతో ఈ ఒప్పందం చాలా సంతోషంగా ఉందని NPCI రాజీవ్ పిళ్లై ఈ ఒప్పందం గురించి చెప్పారు. ఆటో పే ఫీచర్ గేమ్ ఛేంజర్‌గా నిరూపిస్తుందని మేము నమ్ముతున్నాము. దేశంలోని ఎన్నో రకాల వ్యాపారాల్లో యూపీఐని పేమెంట్‌గా ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం, ప్రచారం కోసం రూపొందించిన పాట YouTube ఇంకా అన్ని ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ పాటను YAAP కంపోజ్ చేసింది. ఫౌలర్ రాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య సింగ్ సిసోడియా. అతను పంజాబీ పాటలతో కెరీర్ ప్రారంభించాడు. అతను యోయో హనీ సింగ్‌తో కూడా పనిచేశాడు.
 

click me!