చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు అంతర్జాతీయ మొబైల్ మార్కెట్ ను కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంటే.. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ చైనా మార్కెట్ వైపు కేంద్రీకరించింది. ఈ నెలాఖరులోగా నోకియా 6 మోడల్ ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
నోకియా వినియోగదారులకు హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ నెలాఖరులో గానీ, వచ్చేనెల మొదటి వారంలో 6.2 అంగుళాల నిడివి గల ‘నోకియా 6’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. చైనా మార్కెట్‌లో తొలిసారి నోకియా 6తోపాటు నోకియా 9 మోడల్ స్మార్ట్ ఫోన్ కూడా ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 632ఎస్‌వోసీ అమర్చారు. ఈ ఫోన్ 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లలో లభించనున్నది. దీనికి అదనంగా ఓజో ఆడియో కూడా చేర్చారు. నోకియా తన ఫ్లాగ్ షిప్ ‘నోకియా 9’ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను కొద్ది సమయం తీసుకుని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నోకియా 9 ప్లగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మాదిరిగా నోకియా 6 ఫోన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్ మెరుగైన ప్రాసెసర్‌తోపాటు బిగ్ డిస్ ప్లే కలిగి ఉండనున్నది.
undefined
భారత్ మార్కెట్లోకి ‘హువావే వై 9’ఆవిష్కరణ
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వై సిరీస్‌లో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో గురువారం విడుదల చేసింది. ముందూ, వెనక మొత్తం నాలుగు బిగ్ కెమెరాలతో.. యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్ అయిపోతారని కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చింది. ఈ నెల 15నుంచి ఈ- కామర్స్ స్టోర్ అమెజాన్‌లో ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది.
హువావే ‘వై 9’ ఫీచర్లు ఇవే:
6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే గల హువావే వై9 ఫోన్‌లో 2340x1080 రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.2 ఆక్టాకోర్ కిరిన్ 710 సాక్, 4జీబీ ప్లస్ 64జీబీ నుంచి 256దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉన్నాయి. ఇక 16+2ఎంపీ డ్యుయల్ రియర్‌కెమెరా, 13+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలతోపాటు 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కూడా అమర్చారు. ఈ ఫోన్ రూ.15,999లకు లభించనున్నది.