‘కుంభ్‌ జియో ఫోన్‌’ ఆవిష్కరణ

By sivanagaprasad kodati  |  First Published Jan 8, 2019, 8:28 AM IST

15 నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ నగరంలో జరిగే కుంభమేళా వేడుకల సందర్భంగా రిలయన్స్ జియో ‘కుంభ్ జియో’ఫోన్ ప్లస్ ఫ్యామిలీ లొకెటేర్ పేరిట యాప్ ఆవిష్కరించింది. కుంభమేళా ముగిసే వరకు అన్ని రకాల విశేషాలను తెలియజేసే ఈ యాప్.. జియో ఫోన్ నుంచి ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం పొందొచ్చు. 


టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు అలహాబాద్‌ కుంభమేళా సందర్భంగా యాత్రికులకు అద్భుత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా కుంభమేళా యాత్రికుల కోసం ‘కుంభ్‌ జియో ఫోన్‌’, ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో యాప్‌ను ఆవిష్కరించింది. 

ఇందులో కుంభమేళాకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి. 4జీ డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌ వసతి కల్పిస్తోంది. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు పొందేలా ఏర్పాట్లు చేశారు.

Latest Videos

undefined

కుంభమేళాపై ఓ సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదలచేసినట్లు తెలిపింది. మార్చి 4వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవంలో పాల్గొనేవారు తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తోంది.

జనం మధ్యలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుకోవడం కుంభమేళాలో క్లిష్టతరం కాగా, ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని రిలయన్స్‌ జియో వివరించింది. తప్పిపోయే కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.   

కుంభమేళా పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక బస్సులు, రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టికెట్స్‌ బుకింగ్‌ చేసుకోవడం తేలిక. ఇక బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి పొందొచ్చు. 

ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లతోపాటు కుంభమేళా జరిగే ప్రదేశం రూట్‌మ్యాప్‌ అందుబాటులో ఉంటుంది. కుంభ్ మేళా సందర్భంగా నిర్వహించే పూజల వివరాలు తెలియజేస్తుంది. 

మీ కుటుంబసభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారో లొకేషన్‌ చూపుతుంది. మీ వెంట వచ్చిన వాళ్లెవరైనా తప్పిపోతే వాళ్లను కనిపెట్టేందుకు సహకరిస్తోంది. కుంభమేళా కార్యక్రమాలను జియో టీవీ ద్వారా వీక్షించే సదుపాయం అందుబాటులో ఉన్నది. 

ఇక కుంభ్‌ రేడియో ద్వారా 24x7 భక్తి గీతాలను వినవచ్చు. ఎప్పటికప్పుడు కుంభమేళా ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు ఎప్పటికప్పుడు పొందవచ్చు. ప్రతిరోజు నిర్వహించే కుంభ్‌ క్విజ్‌లో పాల్గొని వాటికి సమాధానాలిచ్చి బహుమతులు పొందవచ్చు.

click me!