కాలింగ్ ఫీచర్‌తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌.. ఫోన్‌ను జేబులో పెట్టుకుని వాచ్‌తో మాట్లాడవచ్చు..

By asianet news teluguFirst Published Dec 14, 2022, 3:59 PM IST
Highlights

మాక్సిమా మ్యాక్స్ ప్రో హీరో బ్లాక్, రోజ్ గోల్డ్ ఇంకా గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. వాచ్ ధర రూ.1,999. ఈ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు.  
 

దేశీయ కంపెనీ మాక్సిమా  కొత్త స్మార్ట్‌వాచ్ మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో హీరోను ఇండియాలో లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో హీరో స్మార్ట్ వాచ్ తో అందించారు. దీని కోసం హెచ్‌డి మైక్ ఇంకా AI వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. మ్యాక్స్ ప్రో హీరో స్మార్ట్‌వాచ్ పెద్ద 1.83-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది అలాగే 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ లభిస్తుంది. 

మాక్సిమా మ్యాక్స్ ప్రో హీరో ధర 
మాక్సిమా మ్యాక్స్ ప్రో హీరో బ్లాక్, రోజ్ గోల్డ్ ఇంకా గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. వాచ్ ధర రూ.1,999. ఈ స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు.  

స్పెసిఫికేషన్‌లు
మాక్సిమా మ్యాక్స్ ప్రో హీరోతో పెద్ద 1.83-అంగుళాల డిస్ప్లే ఇచ్చారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో సపోర్ట్ చేస్తుంది. వాచ్‌తో 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 200 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు సపోర్ట్ ఇచ్చారు. Maxima Max Pro Heroతో మీరు ఫోన్ కెమెరా ఇంకా మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయవచ్చు. 

 వాచ్‌తో అడ్వాన్స్ కాలింగ్ సదుపాయం ఉందని, యూజర్లు ఫోన్‌ను జేబులో పెట్టుకుని వాచ్‌తో అంతరాయం లేకుండా మాట్లాడవచ్చని కంపెనీ పేర్కొంది. కాల్స్ రిజెక్ట్ సదుపాయం కూడా వాచ్‌తో  ఉంది. 

మాక్సిమా మ్యాక్స్ ప్రో హీరో స్మార్ట్‌వాచ్  అదనపు ఫీచర్ల గురించి మాట్లాడితే సోషల్ మీడియా నోటిఫికేషన్, అలారం, స్టాప్‌వాచ్ టైమర్, ఫిమేల్ హెల్త్ & పీరియడ్ ట్రాకర్, DND/పవర్ సేవర్ మొదలైన ఫీచర్లతో వస్తుంది.
 

click me!