కొబ్బరికాయ కోట్టలేదు, రిబ్బన్‌ కట్టింగ్ లేదు; ఇండియాలో ఆపిల్ ఫస్ట్ స్టోర్ ప్రారంభోత్సవం ఎలా జరిగిందంటే..?

By asianet news teluguFirst Published Apr 21, 2023, 4:49 PM IST
Highlights

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ భారతదేశంలో తొలి యాపిల్ స్టోర్‌ను తాజాగా ప్రారంభించారు.  ప్రారంభోత్సవం సందర్భంగా రెడ్ రిబ్బన్‌ కట్ చేయలేదు, కొబ్బరికాయ  కూడా కొట్టలేదు. టీమ్ కుక్ నేరుగా ఆపిల్ స్టోర్ తలుపులు తెరిచి స్టోర్‌ను ప్రారంభించారు. 
 

ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ మొదటి అధికారిక ఆపిల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించిన సంగతి మీకు తెలిసిందే. ముంబైలో ఆపిల్ బీకేసీ స్టోర్‌ను కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా రెడ్ రిబ్బన్‌ కట్ చేయలేదు, కొబ్బరికాయ  కూడా కొట్టలేదు. టీమ్ కుక్ నేరుగా ఆపిల్ స్టోర్ తలుపులు తెరిచి స్టోర్‌ను ప్రారంభించారు. 25 ఏళ్ల తర్వాత ఆపిల్ తొలి స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించింది.

ఈ ఆపిల్ స్టోర్ అన్ని ఇతర స్మార్ట్‌ఫోన్ స్టోర్‌ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాఖండాలను ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ రూపొందించబడింది. స్టార్ పైకప్పు 1,000 టైల్స్ తో కప్పబడి ఉంది, వీటిలో ప్రతి ఒక్కటి 408 చెక్కతో తయారు చేయబడింది. స్టోర్ నిర్వహణ కోసం సౌరశక్తిని ఉపయోగించారు. అందువలన స్టోర్ పూర్తిగా కార్బన్ న్యూట్రల్ గా ఉంటుంది. స్టార్ 100% రిన్యువబుల్ ఎనర్జీతో నడుస్తుంది.

Latest Videos

ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. కాబట్టి ఆపిల్ కూడా ఇంత పెద్ద మార్కెట్‌ను వదులుకోవడానికి ఇష్టపడదు. ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించడం వల్ల భారతీయ వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం కంపెనీకి లభిస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఆపిల్ అద్భుతమైన సేవను కూడా ఉపయోగించుకోగలరు. ముంబై తర్వాత, ఢిల్లీలోని సాకేత్‌లో రెండవ ఆపిల్ స్టోర్ ఏప్రిల్ 20న ప్రారంభమైంది.

25 దేశాల్లో 552 యాపిల్ స్టోర్‌లు - ప్రారంభానికి ముందే ముంబైలోని యాపిల్ స్టోర్ కిక్కిరిసిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ఈ ప్రజలందరూ గుమిగూడారు. ముంబైలోని యాపిల్ బీకేసీ, ఢిల్లీలోని యాపిల్ సాకేత్ తర్వాత మొత్తం యాపిల్ స్టోర్ల సంఖ్య 552కి చేరనుంది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో యాపిల్ స్టోర్లు ఉన్నాయి.

ముంబైలోని యాపిల్ స్టోర్ చిరునామాకు వస్తే, ఇది జియో వరల్డ్ డ్రైవ్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంది. కంపెనీ తన సమయాన్ని కూడా ప్రకటించింది. ఆపిల్ స్టోర్ ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీరు వారంలో ఏడు రోజులు ఇక్కడ సేవను పొందవచ్చు. స్టోర్లలో పనిచేసే ఉద్యోగులు కంపెనీ ద్వారా శిక్షణ పొందారు.

Apple Store BKCలో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, వీరు 20 కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలరు. ముంబైలోని ఆపిల్ స్టోర్ ప్రపంచం నలుమూలల నుండి వినియోగదారులను స్వాగతించింది. ఇక్కడ వారికి అత్యుత్తమ ఉత్పత్తులు, సేవల వివరాలు అందించబడతాయి. ఆపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రామ్ సౌకర్యం కూడా స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

భారతీయ కస్టమర్లు Apple BKC స్టోర్‌లో కంపెనీ AI సర్వీస్ 'Apple Genius'తో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. ఈ సదుపాయం విదేశాల్లోని ఆపిల్ స్టోర్లలో అందించే సౌకర్యాల లాగానే ఉంటుంది.

Apple జీనియస్ నుండి, కస్టమర్‌లు ఏదైనా కంపెనీ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని పొందవచ్చు. కస్టమర్లు కొత్త ఐఫోన్ ఇంకా కంపెనీ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే, కొనుగోలుదారులు పాత iPhone, Mac, iPadని మార్చుకోవచ్చు.

కంపెనీకి చెందిన ఈ అధికారిక ఆపిల్ స్టోర్ కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తుంది. ఇంకా మీకు కంపెనీ ఒరిజినల్ ఉత్పత్తులను ఒకే పైకప్పు క్రింద అందిస్తుంది.

click me!