మోటోరోల నుండి అద్భుతమైన ఫోన్‌.. ఇప్పుడు సిగ్నల్ లేకపోయినా మెసేజ్ పంపవచ్చు..

By asianet news teluguFirst Published Feb 27, 2023, 5:47 PM IST
Highlights

మోటోరోల డెఫి 2తో 5G కనెక్టివిటీ కూడా అందించబడింది. కంపెనీ బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన మోటోరోల డెఫి శాటిలైట్ లింక్ డివైజ్ కూడా పరిచయం చేసింది, దీనిని కొత్త ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ తో ఉపయోగించవచ్చు.
 

లెనోవా యాజమాన్యంలోని మోటోరోల ఒక కొత్త ఫోన్ మోటోరోల డెఫి 2ని విడుదల చేసింది. మోటోరోల డెఫి 2 ఒక కఠినమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్ ఇందులో ఉంది. శాటిలైట్ కనెక్టివిటీతో మోటోరోల డెఫి 2 త్వరలో ఉత్తర అమెరికా, కెనడా, లాటిన్ అమెరికాలో అమ్మకానికి రానుంది. మోటోరోల డెఫి 2తో 5G కనెక్టివిటీ కూడా అందించారు. కంపెనీ బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన మోటోరోల డెఫి శాటిలైట్ లింక్ డివైజ్ ని కూడా పరిచయం చేసింది, దీనిని కొత్త iPhone అండ్ Androidతో ఉపయోగించవచ్చు.

మోటోరోల డెఫి 2, మోటోరోల డెఫి  శాటిలైట్ లింక్ ధర
మోటోరోల డెఫి 2 ధర $599 అంటే దాదాపు రూ.49,600. దీనితో, SOS అసిస్టెంట్ సపోర్ట్ 12 నెలల పాటు ఉంటుంది. దీనితో మెసేజింగ్ ప్లాన్ $ 4.99 చార్జ్ ఉంటుంది, అంటే నెలకు దాదాపు రూ. 400. మోటోరోల డెఫి శాటిలైట్ లింక్ ధర $99 అంటే దాదాపు రూ. 8,200.

మోటోరోల డెఫి 2స్పెసిఫికేషన్‌లు
ఆండ్రాయిడ్ 12 మోటరోలా డెఫి 2లో ఇచ్చారు, అయితే దీనికి ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్‌కు ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించబడతాయి. మోటోరోల డెఫి 2 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే  ఉంది. Motorola Defy 2లో MediaTek Dimensity 930 ప్రాసెసర్ 6 జి‌బి ర్యామ్ ఉంది.

మోటరోలా డిఫై 2 కెమెరా
మోటో  ఈ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు. రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్,  మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

మోటోరోల  డిఫై 2 బ్యాటరీ
మోటోరోల డెఫి 2 Wi-Fi, 5G, 4G, బ్లూటూత్, శాటిలైట్ కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది ఇంకా Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వాటర్ రిసిస్టంట్ కోసం ఫోన్ IP68, IP69K రేటింగ్‌ పొందింది. అదనంగా, ఈ ఫోన్ Mil-Spec 810H  సర్టిఫికేషన్ కూడా పొందింది.

click me!