యూ‌పి‌ఐ పేమెంట్ యాప్‌ని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ టిప్స్ మర్చిపోకుండా అనుసరించండి..

By asianet news teluguFirst Published Feb 27, 2023, 2:44 PM IST
Highlights

నేడు యూ‌పి‌ఐ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. యూ‌పి‌ఐ ఆర్థిక లావాదేవీలను చాలా సులభతరం చేసిందనేది నిజం. అయితే, యూ‌పి‌ఐ చెల్లింపులు చేసేటప్పుడు తగిన భద్రతా చర్యలను అనుసరించడం కూడా అంతే ముఖ్యం. నేడు సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నందున, మోసగాళ్ళు డబ్బు దొంగిలించడానికి కొత్త మార్గాలను కనుగొంతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. 
 

గత కొంత కాలం నుండి ఆన్‌లైన్ పేమెంట్ల కోసం యూ‌పి‌ఐ వినియోగం గణనీయంగా పెరిగింది. భారతదేశంలో యూ‌పి‌ఐ సృష్టించిన విప్లవం ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసింది. అంతే కాదు, కొన్ని దేశాలు కూడా ఇండియన్ యూ‌పి‌ఐ మోడల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. యూపీఐ వినియోగం పెరగడం వల్ల డెబిట్ కార్డుల వినియోగం తగ్గింది. అయితే, UPI చెల్లింపులు డబ్బు బదిలీని సులభతరం చేస్తాయి, అయితే  ఆన్‌లైన్ లావాదేవీల్లో కొద్దిపాటి అజాగ్రత్త వల్ల నష్టం కూడా వాటిల్లుతుంది.

ఆన్‌లైన్ మోసగాళ్లకు UPI కూడా పెద్ద లక్ష్యం. ఆన్‌లైన్ మోసగాళ్లు యూపీఐ యూజర్లు జాగ్రత్తగా లేకపోయినా క్షణాల్లో డబ్బు  విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం వారు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు. అందుకే UPI ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. కాబట్టి ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..

స్క్రీన్ లాక్
పవర్ ఫుల్ స్క్రీన్ లాక్ ఇంకా బెస్ట్ పాస్‌వర్డ్‌ను స్క్రీన్ లాక్ కోసం ఇన్‌స్టాల్ చేయండి అలాగే దీన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఇంకా గుర్తుంచుకోవడానికి ఎక్కడ వ్రాయవద్దు. మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా అప్లికేషన్‌లను మోసగాళ్ల నుండి సురక్షితంగా ఉంచండి. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి సాధారణ పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు. 

పిన్‌ను షేర్ చేయవద్దు
మీ UPI పిన్‌ను ఏ కారణం చేతనైనా ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీ పిన్ ఎవరికైనా తెలిస్తే, వెంటనే దాన్ని మార్చండి. మీ పిన్ తెలిసిన వ్యక్తి మీ ఖాతా నుండి సులభంగా డబ్బును బదిలీ చేయవచ్చు.

SMS అండ్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి
ఇటీవల మోసగాళ్లు కాల్స్, SMS ఇంకా ఈ-మెయిల్‌ల ద్వారా బ్యాంక్ అక్కౌంట్ లోని డబ్బును దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీకు తెలియని వ్యక్తి కాల్స్ చేసి, మీ UPI లావాదేవీ లేదా డిజిటల్ చెల్లింపు సంబంధిత సమాచారాన్ని అడిగితే దాన్ని షేర్ చేయవద్దు. ఈ సమాచారం కోసం ఏ బ్యాంకు లేదా సంస్థ మిమ్మల్ని అడగదు. అంతేకాకుండా మీకు SMS లేదా ఇ-మెయిల్‌తో పాటు లింక్‌లను పంపవచ్చు,  దానిపై క్లిక్ చేయమని అభ్యర్థించవచ్చు. ఏ కారణం చేతనైనా అలాంటి లింక్‌లను తెరవవద్దు. ఈ లింక్‌లను ఉపయోగించి మోసగాళ్లు మీ ఖాతాలోని డబ్బును దొంగిలిస్తారు జాగ్రత్త.

UPI అప్లికేషన్‌ను అప్‌డేట్ చేయండి
UPIని ఉపయోగిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ లేటెస్ట్ వెర్షన్‌ని ఉపయోగించండి. ఎందుకంటే కొత్త అప్ డేట్స్ భద్రతాను పెంచుతాయి. వీటిని ఉపయోగించి మీరు మీ ఖాతాను ఆన్‌లైన్ మోసగాళ్ల నుండి రక్షించుకోవచ్చు. అలాగే మీ ఫోన్‌లో మల్టీ పేమెంట్ యాప్‌లను ఉపయోగించవద్దు. మొబైల్ చెల్లింపు అప్లికేషన్‌ను ఉపయోగించే ముందు దాని స్టాండర్డ్ కూడా చెక్ చేసి, ఆపై దాన్ని డౌన్‌లోడ్ చేయండి. 

click me!