Vivo X Fold:వివో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు ఆకర్షణీయమైన ధరకే..

By asianet news telugu  |  First Published Apr 12, 2022, 12:33 PM IST

వివో ఎక్స్ నోట్ కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. వివో ఎక్స్ నోట్‌లో 7-అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కాకుండా రెండు ఫోన్‌లు జిసిస్ ఆప్టిక్స్‌కు సపోర్ట్ తో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.


వివో  మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్  వివో ఎక్స్(Vivo X)ఫోల్డ్, వివో ఎక్స్ నోట్‌ను చైనాలో విడుదల చేసింది. వివో ఎక్స్ ఫోల్డ్, ఎక్స్  నోట్ రెండూ కంపెనీ  మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు. వివో ఎక్స్ నోట్‌లో 7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ కాకుండా రెండు ఫోన్‌లు జిసిస్ (Zeiss) ఆప్టిక్స్‌కు సపోర్ట్ తో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ అండ్ ఎక్స్ నోట్ కాకుండా కంపెనీ వివో ప్యాడ్‌ను కూడా విడుదల చేసింది, ఇది కంపెనీ మొదటి టాబ్లెట్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే వివో ప్యాడ్‌తో అందించారు ఇంకా స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ధర
వివో ఎక్స్  ఫోల్డ్ ప్రారంభ ధర 8,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 1,07,200. ఈ ధరతో 12జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్  ఉంటుంది. వివో ఎక్స్ నోట్ ప్రారంభ ధర 5,999 యువాన్ అంటే దాదాపు రూ. 71,400. ఈ ధర వద్ద  8 జి‌బి ర్యామ్ తో 256 జి‌బి  స్టోరేజ్ లభిస్తుంది. వివో ప్యాడ్ ప్రారంభ ధర 2,499 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 29,800. ఈ ధర వద్ద 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. భారతదేశంలో ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ గురించి ప్రస్తుతం ఎటువంటి వార్తలు లేవు. అయితే ట్యాబ్‌ను త్వరలో భారతదేశంలో లాంచ్ చేయవచ్చు.

Latest Videos

undefined

వివో ఎక్స్  ఫోల్డ్ స్పెసిఫికేషన్‌లు
వివో ఎక్స్  ఫోల్డ్‌లో Android 12 ఆధారిత OriginOS,8.03-అంగుళాల Samsung E5 ఫోల్డింగ్ డిస్‌ప్లే, 2K + (1916x2160 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌, ప్రైమరీ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌  పొందుతుంది. దీనికి అల్ట్రా టఫ్ గ్లాస్ (UTG) ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ Vivo ఫోన్ 6.53-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుంది అంటే రెండవ డిస్‌ప్లే. Vivo X ఫోల్డ్ గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌ను ప్యాక్ చేస్తుంది, 12GB LPDDR5 RAMతో 512GB వరకు స్టోరేజ్ ఉంటుంది.

వివో ఎక్స్  ఫోల్డ్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రాథమిక లెన్స్ 50 మెగాపిక్సెల్‌. కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. మిగిలిన మూడు లెన్స్‌లు 48 మెగాపిక్సెల్‌లు, 12 మెగాపిక్సెల్‌లు, 8 మెగాపిక్సెల్‌లు. Vivo X Fold 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS / A-GPS / NavIC, NFC, USB టైప్-సి పోర్ట్‌ ఉంది. ఫోన్‌లో అల్ట్రాసోనిక్ 3డి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Vivo X ఫోల్డ్ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4600mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీనితో పాటు 80W గాలియం నైట్రైడ్ (GaN) PD ఛార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఉంది.

వివో ఎక్స్ నోట్  ఫీచర్స్ 
వివో ఎక్స్ నోట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 7-అంగుళాల 2K+ Samsung E5 డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12GB LPDDR5 ర్యామ్‌తో పాటు 512జి‌బి స్టోరేజ్, నాలుగు బ్యాక్ కెమెరాలు, కెమెరా సెటప్ Vivo X ఫోల్డ్ లాగానే ఉంటుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS / A-GPS / NavIC, NFC, USB టైప్-సి పోర్ట్‌ ఉంది. Vivo X Note 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

వివో ప్యాడ్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత OriginOS HD వివో ప్యాడ్‌లో ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల 2.5K డిస్‌ప్లే ఉంది. దీనితో HDR10కి సపోర్ట్ కూడా ఉంది. ఈ ట్యాబ్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ 8జి‌బి వరకు ర్యామ్, 256 జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. వివో ప్యాడ్‌లో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌తో నాలుగు స్పీకర్లు ఉన్నాయి.

వివో ప్యాడ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఇంకా ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉంది. Vivo ప్యాడ్‌లో కనెక్టివిటీ కోసం Wi-Fi 6, బ్లూటూత్ v5.2, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఛార్జింగ్ కోసం పోగో పిన్‌ను ఇచ్చారు. ట్యాబ్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 8040mAh బ్యాటరీ ఉంది.

click me!