ఎల్‌జి జి ప్యాడ్ 4 యొక్క అప్ గ్రేడ్ టాబ్ ఫోన్ ఎల్‌జి జి ప్యాడ్ 5 10.1 . ఎల్జీ జి ప్యాడ్ 5 10.1 టాబ్లెట్ దక్షిణ కొరియాలో లాంచ్ చేశారు. ఇందులో గొప్ప విషయం ఏంటి అంటే పెద్ద 8,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఎల్జీ జి ప్యాడ్ 5 10.1 టాబ్లెట్ దక్షిణ కొరియాలో లాంచ్ చేశారు. ఇందులో గొప్ప విషయం ఏంటి అంటే పెద్ద 8,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాడ్-కోర్ స్నాప్డ్రాగన్ 821 SoC, 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా. ఎల్‌జి జి ప్యాడ్ 4 యొక్క అప్ గ్రేడ్, ఎల్‌జి జి ప్యాడ్ 5 10.1 పూర్తి-హెచ్‌డి + డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్, అన్ని వైపులా బెజెల్ ఫ్రేమ్ డిస్ప్లే మరియు వెనుక భాగంలో సింగిల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
టాబ్లెట్ 512GB వరకు సపోర్ట్ అందిస్తుంది. దక్షిణ కొరియాలో సిల్వర్ హ్యూ కలర్ లో విడుదల చేశారు. ఎల్జీ జి ప్యాడ్ 5 10.1 ధర మరియు స్పెసిఫికేషన్ల గురించి మరిన్ని వివరాల తెలుసుకుందాం.ఎల్‌జి జి ప్యాడ్ 10.1 టాబ్లెట్ ధర కెఆర్‌డబ్ల్యూ 440,000 (సుమారు రూ. 26,800), సిల్వర్ హ్యూ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.
undefined
also read స్మార్ట్ టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ ఇక పనిచేయదు...
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ టాబ్లెట్ ఎప్పుడు లభిస్తుందనే దానిపై సమాచారం లేదు.స్పెసిఫికేషన్లకు అనుగుణంగా, ఎల్జీ జి ప్యాడ్ 5 10.1 ఆండ్రాయిడ్ పై అవుట్-ఆఫ్-బాక్స్‌లో నడుస్తుంది. 10.1-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1920x1200 పిక్సెల్స్) ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇది 4GB ర్యామ్‌తో 2.34GHz స్నాప్‌డ్రాగన్ 821 క్వాడ్-కోర్ SoC చేత పనిచేస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 32GB తో వస్తుంది, మైక్రో SD కార్డ్ (512GB వరకు) ఉపయోగించి స్టోరేజ్ స్టోరేజ్ పెంచుకోవచ్చు.కెమెరాల విషయానికి వస్తే, ఎల్జీ జి ప్యాడ్ 5 10.1 టాబ్లెట్ ఆటోఫోకస్‌తో కూడిన 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.
also read వాట్సాప్ న్యూ ఫీచర్: వెంటనే అప్ డేట్ చేసుకోండీ
ఇది క్విక్ ఛార్జ్ 3.0 తో 8,200 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ తో ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ వి 4.2, వై-ఫై 802.11 ఎ / బి / జి / ఎన్ / ఎసి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 mm ఆడియో జాక్, జిపిఎస్ ఇంకా మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ టాబ్లెట్ యొక్క కుడి అంచున, పవర్ మరియు వాల్యూమ్ బటన్లు పక్కన ఉంటాయి.
డ్యూయల్ స్పీకర్ గ్రిల్ USB టైప్-సి పోర్టుకు రెండు వైపులా ఉంటాయి. సింగిల్ సిమ్ ట్రే స్లాట్ తో వస్తుంది. LG G ప్యాడ్ 5 10.1 యొక్క సైజ్ 247.2x150.7x8mm, దీని బరువు 498 గ్రాములు.