డేటా అండ్ వాయిస్ కాలింగ్ సౌకర్యాలతో బడ్జెట్ జియో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రూ.500లోపు ఆన్ లిమిటెడ్ డేటా అండ్ వాయిస్ కాల్స్ అందించే బెస్ట్ జియో రీఛార్జ్ ప్లాన్‌ల లిస్ట్ ఇక్కడ ఉంది.
దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో నంబర్ వన్ టెలికాం కంపెనీగా కొనసాగుతుంది. అయితే జియో యూజర్ల వివిధ రిచార్జ్ అవసరాలను తీర్చడానికి ఇందులో రకరకాల రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఆన్యువల్ ప్లాన్‌లు, ప్రతినెల ప్లాన్‌లు, షార్ట్ టర్మ్ డేటా టాప్-అప్‌లు వంటి వివిధ రకాల ప్లాన్‌లు కూడా ఉన్నాయి. అయితే మీరు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా.. ఇందుకు రూ.500 బడ్జెట్ కంటే తక్కువ ప్లాన్‌ల గురించి మీకోసం...
జియో రూ.119 ప్లాన్: ఈ ప్లాన్ 14 రోజుల వాలిడిటీ, 1.5 GB డైలీ డేటా లిమిట్, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMS, జియో టివి, జియో సినిమా, జియో సెక్యూరిటి, జియో క్లౌడ్ వంటి జియో సేవలకు యాక్సెస్ అందిస్తుంది.
జియో రూ. 149 ప్లాన్: 1GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 20 రోజుల వాలిడిటీతో జియో యాప్స్ యాక్సెస్ అందిస్తుంది.
జియో రూ. 179 ప్లాన్: ఈ ప్యాక్ 1GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 24 రోజుల పాటు Jio యాప్స్ యాక్సెస్ అందిస్తుంది.
జియో రూ.199 ప్లాన్: ఈ ప్లాన్ 23 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది.
జియో రూ. 209 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 1GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 28 రోజుల పాటు Jio యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది.
జియో రూ. 239 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSల, Jio యాప్‌లకు అక్సెస్, 28 రోజులు వాలిడిటీ ఉంటుంది.
జియో రూ.249 ప్లాన్: ఈ ప్లాన్ 5G కోసం Jio వెల్‌కమ్ ఆఫర్ కింద వస్తుంది. 2GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 23 రోజుల పాటు Jio యాప్‌లకు అక్సెస్ అందిస్తుంది.
జియో రూ. 259 ప్లాన్: ఈ ప్లాన్ 1 నెల వాలిడిటీతో వస్తుంది, మీరు రోజుకు 1.5GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లు, Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ని పొందవచ్చు. ఈ యాక్టివ్ ప్యాక్ వాలిడిటీ సమయంలో అర్హత ఉన్న Jio యూజర్‌లు ఆన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
జియో రూ.296 ప్లాన్: ఈ ప్లాన్ జియో ఫ్రీడమ్ ప్లాన్‌ల క్రింద గత సంవత్సరం ప్రవేశపెట్టారు. 30 రోజుల పాటు 25GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను అందిస్తుంది.
జియో రూ. 299 ప్లాన్: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కేటగిరీ కింద లిస్ట్ చేయబడిన బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌లలో ఈ ప్లాన్ ఒకటి. ఈ ప్యాక్‌తో మీరు రోజుకు 2GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 28 రోజుల వాలిడిటీని పొందవచ్చు.
జియో రూ. 349 ప్లాన్: ఈ జియో మరొ ప్లాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీపెయిడ్ ప్లాన్ ఇంకా 2.5GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 30 రోజుల పాటు Jio యాప్‌లకి అక్సెస్ అందిస్తుంది.
Jio రూ. 419 ప్లాన్: ఈ ప్లాన్ కింద Jio యూజర్లు రోజుకు 3GB డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 28 రోజుల పాటు Jio యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
Jio రూ. 479 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లకు అక్సెస్ పొందవచ్చు.