రిలయన్స్ జియో ఈ ప్లాన్‌లతో 2.5జిబి డైలీ డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ బెనెఫిట్స్, జియో సినిమా, జియో టివి, జియో క్లౌడ్, జియో సెక్యూరిటితో సహా జియో యాప్‌లకు ఉచిత అక్సెస్ అందిస్తాయి.
ఇండియాలోని ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.349, రూ.899 ధరలతో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కస్టమర్లు ఎక్కువ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ వంటి సౌకర్యాలను పొందవచ్చు. కంపెనీ MyJio యాప్, అఫిషియల్ వెబ్‌సైట్ ఇతర రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లలో రెండు ప్లాన్‌లను లిస్ట్ చేసింది. కంపెనీ 5G ప్లాన్‌లు రూ. 349, రూ. 899తో లభించే బెనెఫిట్స్ గురించి తెలుసుకొండి...
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌లతో 2.5జిబి డైలీ డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ బెనెఫిట్స్, జియో సినిమా, జియో టివి, జియో క్లౌడ్, జియో సెక్యూరిటితో సహా జియో యాప్‌లకు ఉచిత అక్సెస్ అందిస్తాయి. రూ. 349 ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో, రూ. 899 ప్లాన్ మూడు నెలలు వాలిడిటీతో వస్తుంది.
undefined
రిలయన్స్ జియో రూ. 349 ప్లాన్
రిలయన్స్ జియో అఫిషియల్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజు 2.5జిబి డేటా, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 30 రోజుల పాటు రోజుకు 100 SMSలను అందిస్తుంది. యూజర్లు జియో సినిమా, జియో టివి, జియో క్లౌడ్, జియో సెక్యూరిటికి కూడా ఉచిత అక్సెస్ పొందుతారు. దీనితో పాటు, వాలిడిటీ సబ్‌స్క్రైబర్‌లు ఆన్ లిమిటెడ్ 5G కవరేజీని కూడా పొందుతారు.
రిలయన్స్ జియో రూ.899 ప్లాన్
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌తో మూడు నెలల (90 రోజులు) వాలిడిటీ, రోజుకు 2.5జిబి డేటా కూడా లభిస్తుంది. రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ తో 90 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. జియో సినిమా, జియో టివి, జియో క్లౌడ్, జియో సెక్యూరిటి వంటి Jio యాప్‌లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో, కంపెనీ వాలిడిటీ అయ్యే వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ 5G యాక్సెస్‌ను కూడా అందిస్తోంది.
రిలయన్స్ జియో రూ.61 ప్లాన్
జియో ఈ 5G అప్‌గ్రేడ్ ప్లాన్‌తో 6జిబి హై-స్పీడ్ డేటా వస్తుంది. అంతే కాకుండా, ఈ ప్లాన్ వాలిడిటీ ఉండదు, అంటే దాని వాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ వాలిడిటీ అవుతుంది. జియో రూ. 61 జియో వెల్‌కమ్ ఆఫర్ రూ. 119, రూ. 149, రూ. 179, రూ. 199, రూ. 209 ప్లాన్‌లతో పనిచేస్తుంది.