
భారత టెలికాం రంగంలో పెను సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో తాజాగా జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫీచర్లు కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా జియో తక్కువ ధరకే 'జియోబుక్' పేరుతో ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అత్యంత చవకైన ల్యాప్‌టాప్‌గా చర్చ జరుగుతోన్న ఈ జియో బుక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టెలికాం సంస్థ జియో ఇప్పుడు తమ స్వంత ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. JioBook పేరుతో ల్యాప్ టాప్ కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. అయితే ఈ ల్యాప్ టాప్ ను Emdoor Digital Technology Co Ltd అనే సంస్థ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్ తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. జియో ల్యాప్ టాప్ విండోస్ 10 అవుట్-ఆఫ్-ది-బాక్స్ పేరుతో మార్కెట్లోకి రానుంది. దీన్ని విండోస్ 11కి కూడా అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయం ఉంది. JioPhone Next లాగా, JioBook ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ AMD లేదా ఇంటెల్ యొక్క x86 ప్రాసెసర్‌లతో వినియోగానికి వస్తుందని తెలిపింది.
అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. JioBook ల్యాప్ టాప్ గురించి ఎక్కువ సమాచారం బయటకు రాలేదు. కానీ, JioBook Android 11లో పని చేయనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ల్యాప్‌టాప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు సమాచారం.
ఈ ల్యాప్‌టాప్ MediaTek MT8788 ప్రాసెసర్, 2GB వరకు RAM తో అందుబాటులోకి రావొచ్చు. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు సమాచారం. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తోన్న ఈ ల్యాప్‌టాప్‌లో 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్‌ప్లేని అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. జియో ఈ ల్యాప్‌టాప్‌ను రెండు విభిన్న మోడల్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. JioBook లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూమర్ మిల్ ప్రకారం.. JioBook ల్యాప్‌టాప్ ధర రూ. 19,999 నుండి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. జియో ల్యాప్‌టాప్ ధర వేర్వేరు మోడల్‌లు, స్టోరేజ్ ఆప్షన్‌ల బట్టి ఉంటుందని సమాచారం. JioBook అధికారిక లాంచ్ తేదీని కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.