Upcoming Phones:డి‌ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాతో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Feb 05, 2022, 11:56 PM IST
Upcoming Phones:డి‌ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాతో ఫిబ్రవరిలో లాంచ్ కానున్న 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

సారాంశం

కొత్త ఏడాదిలో మొదటి నెల ముగిసింది. దీంతో ఫిబ్రవారి నెలలో స్మార్ట్ ఫోన్ లవర్స్ ని ఆకర్శించేందుకు వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు లేటెస్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమనుతున్నాయి. వీటిలో స్యామ్సంగ్ నుండి రియల్, వివో వరకు ఫోన్‌లు ఉన్నాయి. 

జనవరి 2022 బ్యాంగ్ తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నెల మొదలైంది. అయితే చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో ఫిబ్రవరి 2022ని ప్రారంభించింది. మరోవైపు ఈ నెలలోనే పలు ఫోన్లు భారత మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. ఈ జాబితాలో స్యామ్సంగ్ (Samsung) నుండి  షియోమీ (Xiaomi), రియల్ మీ (Realme), వివో (Vivo)వరకు ఫోన్‌లు ఉన్నాయి. స్యామ్సంగ్  గెలాక్సీ ఆన్ ప్యాకేడ్ ఈవెంట్ కూడా ఫిబ్రవరిలో జరగబోతోంది. ఈ నెలలో భారత మార్కెట్లోకి విడుదల కానున్న ఫోన్‌ల జాబితాను చూద్దాం...

తాజాగా ఒప్పో భారతీయ మార్కెట్లో  ఒప్పో రెనో 7 5జి అండ్ రెనో 7  ప్రొ 5జిలను విడుదల చేసింది. ఈ రెండూ ఫోన్లు గత సంవత్సరం చైనాలో మొదటిసారిగా లాంచ్ అయ్యాయి, అయితే భారతీయ వేరియంట్ విభిన్న ఫీచర్స్ పరిచయం చేసింది. ఒప్పో రెనో 7 5జి  భారతీయ మార్కెట్లో  ఎం‌ఐ 11ఎక్స్, రియల్ ఎం‌ఐ  జి‌టి మాస్టర్ ఎడిషన్,  వన్ ప్లస్ నార్డ్ 2లతో పోటీపడుతుంది. అలాగే  రెనో 7 ప్రొ  5జి స్యామ్సంగ్ 20ఎఫ్‌ఈ 5జి, ఎం‌ఐ 11ఐ హైపర్ చార్జ్,  రియల్ మీ జి‌టి వంటి ఫోన్‌లతో పోటీపడుతుంది.

రెడ్ మీ నోట్ 11 లాంచ్ ఫిబ్రవరి 9న జరగబోతోంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 6.43-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో చూడవచ్చు, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలో రెడ్ మీ నోట్ 11ఎస్ లాంచ్  9 ఫిబ్రవరి 2022న జరగబోతోంది. దీనికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించారు.

రియల్‌మీ 9 సిరీస్ లాంచ్ ఫిబ్రవరి 16న భారతదేశంలో జరగబోతోంది. రియల్‌మీ 9 ప్రొ ప్లస్, రియల్‌మీ 9 ప్రొ ఈ సిరీస్ కింద లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ ఫోన్ MediaTek Dimension 920 ప్రాసెసర్‌తో అందించబడుతుంది. ఇంటర్నల్ హార్ట్ బీట్ సెన్సార్ కూడా రియల్ మీ 9 ప్రొ ప్లస్ తో అందుబాటులో ఉంటుంది.

వివో 1టి 5జి వివో టి సిరీస్ క్రింద వస్తున్న మొదటి ఫోన్. వివో 1టి  5జి లాంచ్ కూడా భారతదేశంలో ఫిబ్రవరి 9న జరగబోతోంది. వివో 1టి 5జి గురించి మాట్లాడితే ధరలో చౌకైన ఇంకా సన్నని 5ని ఫోన్ అని చెప్పబడుతోంది. వివో 1టి 5జి ధర 20 వేల రూపాయల కంటే తక్కువగా ఉండొచ్చు.

స్యామ్సంగ్  గెలాక్సీ ఎస్22 సిరీస్ స్యామ్సంగ్ గెలాక్సీ ఆన్ ప్యాకేడ్ ఈవెంట్‌లో విడుదల కానుంది. గెలాక్సీ ఎస్22  Exynos 2200 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో అందించవచ్చు. స్యామ్సంగ్  గెలాక్సీ ఎస్22 ప్లస్,  గెలాక్సీ ఎస్22 అల్ట్రా కూడా ఈ ఈవెంట్‌లో పరిచయం చేయవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Apple : సూపర్ కంప్యూటర్ మీ చేతుల్లోనే.. సరికొత్త M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో ఆపిల్ సంచలనం
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే