WhatsApp alert:వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే జైలు, 20 లక్షల జరిమానా..

Ashok Kumar   | Asianet News
Published : Feb 17, 2022, 07:59 PM IST
WhatsApp alert:వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే జైలు, 20 లక్షల జరిమానా..

సారాంశం

సౌదీ అరేబియాలో వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే 100,000 సౌదీ రియాల్స్ లేదా దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. ఈ జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది.

సౌదీ అరేబియాలోని కఠినమైన చట్టాల గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు. నేరాలు చేసే వారి కోసం కఠినమైన చట్టం అని మీరు తప్పక విని ఉంటారు, కానీ రొటీన్ లైఫ్‌లో అక్కడ చేసే కొన్ని పొరపాట్లు మీపై భారంగా ఉంటాయని మీకు తెలుసా. వాట్సప్ (WhatsApp)నేడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మల్టీమీడియా మెసేజింగ్ యాప్.

ప్రజలు వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం నుండి వృత్తి  సమాచారం వరకు చేర్చించుకుంటారు, అయితే వాట్సాప్‌లో చాటింగ్ చేసే ఈ వ్యసనం మిమ్మల్ని జైలులో పెట్టగలదని అలాగే 20 లక్షల రూపాయల వరకు భారీ జరిమానాను కూడా ఎదుర్కోవచ్చని తెలిస్తే మీరు షాక్ అవుతారు. నివేదిక ప్రకారం సౌదీ అరేబియా సైబర్ క్రైమ్ నిపుణుల ప్రకారం వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ (red heart emoji)ని పంపడం వల్ల మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.

20 లక్షల జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష
సౌదీ అరేబియాలో వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే 100,000 సౌదీ రియాల్ అంటే దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని ఒక నివేదికలో పేర్కొంది. ఈ జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపడం అంటే వేధింపులు అని సౌదీ అరేబియా యాంటీ-ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోటాజ్ కుత్బీ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్ చాట్‌ల సమయంలో కొన్ని ఫోటోలు లేదా ఎమోజీలు వేధింపులగా మారుతాయని, అయితే ఎవరైనా అతనిపై కేసు నమోదు చేస్తే మాత్రమే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

రెడ్ రోజ్ ఎమోజి కూడా ప్రమాదకరం
కుత్బీ ఈ విషయంలో ప్రజలను హెచ్చరిస్తూ  ఒక హెచ్చరిక కూడా విడుదల చేసింది, ఇందులో రెడ్ హార్ట్ ఎమోజీకి సంబంధించి ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. కుత్బీ ప్రకారం, వేధింపులు అనేది అతను లేదా ఆమె శరీరాన్ని తాకిన లేదా మరొక వ్యక్తి పట్ల లైంగిక సంబంధం ఉన్న వ్యక్తి చేసే చర్యగా చూడవచ్చు. ఇందులో ఎమోజీ కూడా ఉంటుంది. రెడ్ హార్ట్ ఎమోజీలే కాకుండా, రెడ్ రోజ్ ఎమోజీ కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే