Twitter tips:ఇండియాలోని ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు నేరుగా 'టిప్స్' పొందవచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Feb 17, 2022, 03:42 PM IST
Twitter tips:ఇండియాలోని ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు నేరుగా 'టిప్స్' పొందవచ్చు..

సారాంశం

మీరు కూడా ట్విట్టర్‌లో ఎవరికైనా టిప్ చేయాలనుకుంటే టిప్ బటన్‌ సెటప్ చేయాల్సి ఉన్నప్పటికీ మీరు వారి ఖాతాలో  చూపించే టిప్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా టిప్ ఇవ్వవచ్చు. అయితే ఈ ఫీచర్స్ మీకు డిఫాల్ట్‌గా కనిపించదు.

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter ) గత సంవత్సరం ప్రకటించిన టిప్స్ ఫీచర్ కోసం  పేటి‌ఎం (Paytm) పేమెంట్స్  అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది.  ట్విట్టర్  టిప్స్ ఫీచర్ తో యూజర్లు ఫాలోవర్స్ నుండి ఫండ్స్ లేదా 'టిప్స్' స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ని గత సంవత్సరంలో ప్రకటించింది అలాగే ఈ ప్లాట్‌ఫారమ్‌లో మానిటైజేషన్‌ను పరిచయం చేయడానికి కంపెనీ చేసిన ఎన్నో ప్రయత్నాలలో ఇది ఒకటి. ట్విట్టర్‌లో టిప్స్ పంపడానికి మరో ఇండియన్ ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్ రేజర్ పే  (Razorpay)కూడా ఉంది. అయితే ఫాలోవర్స్ వారిని నచ్చిన ఖాతాకి టిప్ చేయాలనుకుంటే యాప్‌కి మళ్ళీస్తుంది.  

టిప్స్  ఫీచర్ కోసం పేటి‌ఎంని తీసుకోస్తున్నట్లు ట్విట్టర్ బుధవారం ప్రకటించింది. టిప్స్ ఎనేబుల్ చేసిన ఏదైనా ఖాతాకి వినియోగదారులు ఫండ్ చేయడానికి టిప్ సింబల్ పై నొక్కవచ్చు. తరువాత పేటి‌ఎంతో పేమెంట్ పూర్తి చేయడానికి వారిని యాప్‌కి తీసుకెళుతుంది. అయితే యూజర్ల టిప్ సంపాదనలో కోత పెట్టబోమని ట్విట్టర్ పేర్కొంది. పేటి‌ఎంని చెల్లింపుగా చేర్చడంతో వినియోగదారులు యూ‌పి‌ఐ, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌లు ఇంకా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.  

టిప్స్ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి వినియోగదారులు ఈ స్టెప్స్ అనుసరించాలి:

మొదట మీ  అండ్రాయిడ్ (Android)ఫోన్ లేదా  ఐఫోన్ (iPhone)లో ట్విట్టర్ ఓపెన్ చేయండి
తరువాత మీ అక్కౌంట్ లో ఎడిట్ ప్రొఫైల్  పై క్లిక్ చేయండి
ఇప్పుడు టిప్స్  పై క్లిక్ చేసి ఏలో టిప్స్  పై క్లిక్ చేయండి
పేమెంట్ పూర్తి చేయడానికి చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోండి

మే 2021 నుండి ఎంపిక చేసిన జర్నలిస్టులు, క్రియేటర్‌లతో కంపెనీ ఈ ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత ట్విట్టర్  టిప్స్ సర్వీస్ నవంబర్ 2021లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళంతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే 18 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్