10 నిమిషాల్లోనే మీ ఇంటికి..! శామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్ డిఫరెంట్ గా ఉంటుందా..

By Ashok kumar SandraFirst Published Jan 25, 2024, 6:35 PM IST
Highlights

శామ్సంగ్ ఇప్పుడు భారతదేశంలో  గెలాక్సీ S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల హోమ్ డెలివరీ కోసం జోమాటో యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం  పెట్టుకుంది.

శాంసంగ్ ఇటీవల భారతదేశంలో   ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. కంపెనీ దేశంలో Samsung Galaxy S24, Galaxy S24+ ఇంకా  Galaxy S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను  ఆవిష్కరించింది. 

అలాగే, శామ్సంగ్ ఇప్పుడు భారతదేశంలో  గెలాక్సీ S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల హోమ్ డెలివరీ కోసం జోమాటో యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం  చేసుకుంది. ఇంకా  10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌లను డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఢిల్లీ-NCR, బెంగళూరు ఇంకా ముంబైలోని కస్టమర్‌లు Galaxy S24 Ultra, Galaxy S24+ అండ్  Galaxy S24 స్మార్ట్‌ఫోన్‌లను బ్లింకిట్‌లో ఆర్డర్ చేయవచ్చు. అంతేకాదు ఫోన్ 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో డెలివరీ చేయబడుతుంది.  బ్లింకిట్‌లో గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధర

* శామ్సంగ్ గెలాక్సీ S24 8జిబి + 256జిబి: రూ. 79,999

*శామ్సంగ్ గెలాక్సీ S24 8జిబి + 512జిబి: రూ. 89,999 

* శామ్‌సంగ్  గెలాక్సీ S24 + 12GB + 256GB : రూ. 99,999

*శామ్‌సంగ్  గెలాక్సీ S24 +  12GB + 512GB :  Rs 1,09,999

* Samsung Galaxy S24 Ultra 12GB + 256GB: రూ. 1,29,999

* Samsung Galaxy S24 Ultra 12GB + 512GB: రూ. 1,39,999

* Samsung Galaxy S24 Ultra 12GB + 1TB: రూ. 1,59,999

Samsung Galaxy S24 సిరీస్ ఫీచర్లు
Samsung Galaxy S24 సిరీస్ లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రెటర్, చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్ అండ్ ట్రాన్స్‌క్రైబ్ అసిస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. Samsung కీబోర్డ్  ఇంటర్నల్ AI హిందీతో సహా 13 భాషలలో రియల్  టైంలో  మెసేజెస్ అనువదిస్తుంది.

Samsung Galaxy S24 గెస్చర్ తో  నడిచే 'సర్కిల్ టు సెర్చ్ ఫీచర్'తో వస్తుంది. ఉపయోగకరమైన, అధిక-నాణ్యత సెర్చ్ ఫలితాలను చూడటానికి వినియోగదారులు Galaxy S24 స్క్రీన్‌పై సర్కిల్ చేయవచ్చు, హైలైట్ చేయవచ్చు, వ్రాయవచ్చు లేదా ట్యాప్ చేయవచ్చు. Samsung స్మార్ట్‌ఫోన్‌ల కోసం 7 జనరేషన్స్ OS అప్‌డేట్‌లు ఇంకా 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా వాగ్దానం చేసింది.

click me!