ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌తో లేటెస్ట్ 5జి ఫోన్.. ఫోటోగ్రాఫి కోసం బెస్ట్ కెమెరా ఇంకా అప్ డేట్ ఫీచర్లు కూడా..

By asianet news teluguFirst Published Dec 6, 2022, 2:03 PM IST
Highlights

ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 50 వేల లోపు ధరకే ఈ ఫోన్‌ను అందించవచ్చని అంచనా. ఐకు  11 5జిని ఐకు 11 ప్రోతో పాటు 2023 ప్రారంభంలో ఇండియాలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. 

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకు  ఫాస్టెస్ట్ అండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ ఐకు  11 కింద ఐకు  11 5జి లంచ్ ప్రకటించింది. డిసెంబర్ 8న ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇంతకుముందు కంపెనీ ఈ ఫోన్‌ను డిసెంబర్ 2న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఐకు  11 5G క్వాల్ కం  ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌తో క్వాడ్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ సపోర్ట్ ఇచ్చారు. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సపోర్ట్ లభిస్తుంది.

 ధర 
అయితే ఈ ఫోన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 50 వేల లోపు ధరకే ఈ ఫోన్‌ను అందించవచ్చని అంచనా. ఐకు  11 5జిని ఐకు 11 ప్రోతో పాటు 2023 ప్రారంభంలో ఇండియాలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. 

స్పెసిఫికేషన్లు  
ఐకు 11 5జి అండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓ‌ఎస్ 3ని పొందుతుంది. ఈ ఫోన్ చైనా తర్వాత లాంచ్ చేసిన మొదటి ఫోన్ అవుతుంది, అలాగే Qualcomm అత్యంత వేగవంతమైన ఇంకా సరికొత్త స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో, 512జి‌బి వరకు UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్‌  LPDDR5x ర్యామ్ 12జి‌బి వరకు పొందుతుంది.

 ఫోన్ 6.78-అంగుళాల E6 అమోలెడ్  డిస్ ప్లే సపోర్ట్, 2K రిజల్యూషన్ అండ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్  ప్రొటెక్షన్ కూడా డిస్ ప్లేతో ఇచ్చారు.

కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ 
ఐకు  11 5జి ట్రిపుల్ కెమెరా సెటప్‌ పొందుతుంది, దీనికి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, మూడవది 12-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ లభిస్తుంది. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కెమెరా ఫీచర్ల విషయానికొస్తే, లో లైట్ అండ్ పోర్ట్రెయిట్ మోడ్మెరుగుపరచబడిందని పేర్కొంది. ఐకు  11 5జి 5,000 mAh బ్యాటరీ పొందుతుంది, 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.

click me!