Big news:ఇక పై మీరు ట్రుకాలర్ తో కాల్స్ రికార్డ్ చేయలేరు.. ఇదే చివరి తేదీ..

By asianet news telugu  |  First Published Apr 23, 2022, 1:43 PM IST

ట్రుకాలర్  లో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితం అని ట్రు కలర్ మొదట్లీ పేర్కొంది, కానీ ఇప్పుడు అప్‌డేట్ చేసిన గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం,  ఇకపై కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని ట్రు కలర్ అందించదు.
 


వచ్చే నెల మే 2022 నుండి ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అన్ని థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఇటీవల గూగుల్ తెలిపిన సంగతి మీకు తెలిసిందే. అయితే మీ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఉంటే మీరు కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. కాని ఇప్పుడు ట్రూకాలర్ లేదా కాల్ రికార్డర్ యాప్ వంటి ఏ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కాల్‌లను రికార్డ్ చేయలేరు అని Google స్పష్టం చేసింది. ఇందుకు గూగుల్ ప్లే స్టోర్ గోప్యతా విధానాన్ని మార్చింది.
 
ట్రూకాలర్ వినియోగదారులు
గూగుల్ కొత్త పాలసీకి సంబంధించి, ట్రూకాలర్ యాప్‌లో కాల్ రికార్డింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదని తెలిపింది. Google కొత్త విధానం మే 11 నుండి అమలు చేయబడుతోంది, అంటే 11 మే  2022 తర్వాత, Truecaller వినియోగదారులు కూడా కాల్‌లను రికార్డ్ చేయలేరు. మే 11 నుండి Google APIకి యాక్సెస్‌ను కూడా మూసివేస్తోంది. ట్రూకాలర్ వంటి యాప్‌లు కాల్ రికార్డింగ్ కోసం APIని ఉపయోగిస్తున్నాయి. Truecallerలో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితం అని Truecaller పేర్కొంది, కానీ ఇప్పుడు అప్‌డేట్ చేసిన Google డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం ఇకపై కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని అందించలేదు.

Google యాప్ నుండి రికార్డింగ్ 
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, Google డయలర్ యాప్‌తో వినియోగదారులు మే 11 తర్వాత కూడా కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. ఇందుకు మీ ఫోన్‌లో  ఈ ఫీచర్ ఉంటే, మీరు కూడా కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. కాల్ రికార్డింగ్ నుండి థర్డ్ పార్టీ యాప్‌లను పూర్తిగా తొలగించడమే Google ముఖ్య లక్ష్యం. స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లు కూడా Google Play Store నుండి తీసివేయబడతాయి. వినియోగదారుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.

Latest Videos

click me!