iPhone 13 Offer: తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13.. వారికి మాత్రమే..!

By team teluguFirst Published Jun 24, 2022, 1:48 PM IST
Highlights

ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఐఫోన్ 13 ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్.. ఐస్టోర్ ఇండియా వంటి ప్లాట్ ఫాంల్లో ఐఫోన్ 13 తక్కువ ధరకే అందుబాటులో ఉండ‌నుంది. అదెలాగో తెలుసుకుందాం..!
 

ఆపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 13 ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్.. ఐస్టోర్ ఇండియా వంటి ప్లాట్ ఫాంల్లో ఐఫోన్ 13 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 13లో ఏ వెబ్‌సైట్ బెస్ట్ ఆఫర్‌ను అందిస్తుందో తెలుసా? Apple India iStore తమ ప్లాట్‌ఫారమ్‌లో, iPhone 13 రూ. 52,900 కన్నా తక్కువ ధరకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌పై బ్యాంక్ ఆఫర్, ఇతర డిస్కౌంట్‌లు ఉన్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉందని గమనించాలి. అదనంగా.. మీరు పాత ఐఫోన్ మోడల్‌ను కలిగి ఉంటే.. Exchange చేసుకోవచ్చు. అప్పుడు iPhone 13 ధర మరింత తగ్గుతుంది.

అధికారికంగా.. iPhone 13 బేస్ ధర 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.79,900కు అందుబాటులో ఉంది. 256GB, 512GB స్టోరేజ్‌తో సహా ఇతర రెండు మోడల్‌లు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900 ధరలకు అందుబాటులో ఉన్నాయి. iStore iPhone 13 మోడళ్లపై ఫ్లాట్ రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 13 ప్రారంభ ధరను రూ.74,900కి తగ్గించింది. 256GB, 512GB మోడళ్ల ధర వరుసగా రూ.84,900, రూ.1,04,900కి తగ్గిపోయింది. iStore Apple HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యమై అదనంగా రూ. 4,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

HDFC బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత 128GB, 256GB , 512GB iPhone 13 ధర వరుసగా రూ.70,900, రూ.80,900, రూ.1,00,900కి తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మీ పాత ఐఫోన్‌ను కొత్త ఐఫోన్‌తో Exchange చేసుకుంటే గరిష్టంగా రూ. 18,000 ఎక్స్‌ఛేంజ్ విలువను పొందవచ్చు. మీ వద్ద iPhone XR పర్ఫార్మెన్స్ బాగుంటే.. (పగుళ్లు లేదా డెంట్‌లు లేవు) నిర్ధారించుకోవాలి. అప్పుడు iStore రూ. 18వేల వరకు Exchange Value అందిస్తోంది. iPhone 13 ఫోన్ మోడల్ 128GB, 256GB 512GB ధరలు వరుసగా రూ.52,900, రూ.62,900, రూ.82,900కి తగ్గించనుంది. Exchange Value పూర్తిగా మార్చేయాలంటే.. పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. Samsung, Vivo, Oppo లేదా మరేదైనా ఫోన్‌లతో పోలిస్తే.. చాలా ప్లాట్‌ఫారమ్‌లు iPhone మోడల్‌లలో ఎక్స్ఛేంజ్ విలువను అందిస్తాయి.

click me!