Income Tax Department: హెచ్చరిక.. ఇలాంటి జాబ్స్ విషయంలో జాగ్ర‌త్త‌..!

By team telugu  |  First Published Feb 23, 2022, 11:53 AM IST

ఫేక్ జాబ్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మంగళవారం ఉద్యోగార్థులను హెచ్చరించింది. అక్రమ మార్గంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మవద్దని ప్రజలను కోరింది. 


ఫేక్ జాబ్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మంగళవారం ఉద్యోగార్థులను హెచ్చరించింది. అక్రమ మార్గంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మవద్దని ప్రజలను కోరింది. ఉద్యోగార్థులు ఎస్ఎస్‌సీ లేదా సంబంధిత శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే విశ్వసించాలని సూచించింది. ఇందులో వెలువడే ఆఫర్లకు మాత్రమే స్పందించాలని పేర్కొంది. కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి తప్పుడు అవకాశాలు సృష్టిస్తున్నట్లు హెచ్చరించింది.

నకిలీ అపాయింట్‌మెంట్ లేఖలు అందించే ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని, ఈ ఉద్యోగాలను తాము ఇప్పిస్తామని కొన్ని వెబ్ సైట్లు పేర్కొన్నాయి. అయితే ఉద్యోగాల పేరుతో వారు వంచిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ శాఖలో చేరేందుకు నకిలీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది ఐటీ విభాగం. నకిలీ అపాయిట్​మెంట్స్​తో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఐటీ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగం చేర్పిస్తామంటూ.. డబ్బులు అడుగుతున్నారని తెలిపింది. అలాంటి ఆఫర్లను అస్సలు నమ్మొద్దని స్పష్టం చేసింది.

Latest Videos

'డిపార్టుమెంట్‌లో చేరడానికి నకిలీ అపాయింటుమెంట్ లెటర్స్‌ను జారీ చేయడం ద్వారా ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టించే మోసపూరిత వ్యక్తుల బారిన పడవద్దని ఆదాయపు పన్ను శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది' అని ఐటీ డిపార్టుమెంట్ ట్వీట్ చేసింది. ఫేక్ అపాయింటుమెంట్ లెటర్స్ ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాలను అన్నింటిని ప్రత్యక్షంగా ఎస్ఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఎస్ఎస్‌సీ వెబ్ సైట్‌లో ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు, ఫలితాలు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

click me!