facebook reels:మరో 150 దేశాలకి అందుబాటులోకి.. పూర్తి స్క్రీన్ యాడ్స్ తో పాటు ఎడిటింగ్ కోసం కొత్త టూల్స్ కూడా

By asianet news telugu  |  First Published Feb 23, 2022, 11:48 AM IST

"రీల్స్  ఇప్పటికే మా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటెంట్ ఫార్మాట్, నేడు మేము దీన్ని ఫేస్ బుక్ లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము" అని మెటా సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం ఒక ఫేస్ బుక్ పోస్ట్‌లో తెలిపారు.


సోషల్ మీడియా దిగ్గజం, మార్క్ జుకర్‌బర్గ్  యాజమాన్యంలోని  ఫేస్‌బుక్ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ రీల్స్‌ను కొత్తగా 150 దేశాలలో ప్రారంభించింది. అయితే మెటా బ్లాగ్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. మెటా ఇటీవల ప్రపంచంలోని 10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుండి తప్పుకుంది.

భారతదేశంలో టిక్‌టాక్ బ్యాన్ తర్వాత మెటా 2020లో ఇన్‌స్టాగ్రామ్‌తో రీల్స్‌ను ప్రారంభించింది. "రీల్స్  ఇప్పటికే మా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటెంట్ ఫార్మాట్, ఇంకా నేడు మేము దీన్ని ఫేస్ బుక్ లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము" అని మెటా సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ మంగళవారం ఒక ఫేస్ బుక్ పోస్ట్‌లో తెలిపారు.

Latest Videos

undefined

కంటెంట్ క్రియేటర్‌లు డబ్బు  సంపాదించడానికి కొత్త ఫీచర్‌లను కూడా ప్రవేశపెడతామని మెటా తెలిపింది. మెటా ప్రకారం, రీల్స్ వినియోగదారులు బోనస్ పొందుతారు. అంతేకాకుండా బ్యానర్లు, స్టిక్కర్ల రూపంలో ఉండే వీడియో మధ్యలో ప్రకటనలు చూపబడతాయి. రీల్స్‌లో ఫుల్ స్క్రీన్ యాడ్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి.

ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా త్వరలో రీల్స్‌ను చూడగలరు. ఫేస్‌బుక్ స్టోరీస్ ఫీచర్‌కు బదులుగా రీల్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.  

 కొత్త టూల్స్ 
60 సెకన్ల రీల్స్: వినియోగదారులు ఇప్పుడు గరిష్టంగా 60 సెకన్ల రీల్స్‌ను క్రియేట్ చేయవచ్చు.
డ్రాఫ్ట్‌లు: వినియోగదారులు త్వరలో రీల్స్  డ్రాఫ్ట్ చేసే అవకాశాన్ని పొందుతారు. కొత్త అప్‌డేట్ తర్వాత సేవ్ బటన్‌తో సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
వీడియో క్లిప్పింగ్: వీడియో క్లిప్పింగ్ ఫీచర్ రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా వివిధ ఫార్మాట్లలో వీడియోలను పబ్లిషింగ్ చేయడంలో సహాయపడుతుంది.
 

click me!