అందుబాటులోనే హువావే వై 9 ప్రైమ్‌.. ఫ్రమ్ సెవెన్త్ అవైలబుల్

By rajesh yFirst Published Aug 2, 2019, 4:34 PM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ పాప్‌ అప్‌సెల్ఫీతోపాటు ట్రిపుల్‌ రియర్‌ కెమెరా గల ‘వై 9 ప్రైమ్’ ఆవిష్కరించింది. వినియోగదారులకు రూ.15,990లకే లభించనున్నది. ఈ నెల ఏడో తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యులకు, ఎనిమిదో తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

న్యూఢిల్లీ: చైనా రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలో ఆవిష్కరించింది. హువావే వై 9 ప్రైమ్  పేరుతో ఆ విష్కరించిన ఈ ఫోన్ లో పాప్‌ అప్‌ కెమెరా సెల్ఫీ కెమెరా,  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని కంపెనీ తెలిపింది.  ధర  రూ.15,990 గా ఉంచింది. 

అమెరికా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్‌’ ప్రైమ్‌ కస్టమర్లకు ఈ నెల ఏడవ తేదీ నుంచి, మిగిలిన వారికి ఎనిమిదో తేదీనుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ‘నో కాస్ట్ ఈఎంఐ’ పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యం కల్పించారు. 

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్  లభించనుంది. అమెజాన్ పే ద్వారా కొంటే రూ.500 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే జియో కస్టమర్లకు రూ.2200 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. 

6.7 అంగుళాల ఫుల్ వ్యూ డిస్‌ప్లే గల హువావే వై9 ప్రైమ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై ప్లస్ ఆక్టాకోర్‌ కిరిన్ 710 ప్రాసెసర్ అమర్చారు. ఇది 4 జీబీ ర్యామ్‌తోపాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 

ఇక 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతోపాటు 16+ 8+ 2 ఎంపీ  ట్రిపుల్ రియర్‌ కెమెరా అందుబాటులో ఉంటాయి. అదనంగా 4 000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా అమర్చారు. 

click me!