గూగుల్ ఉద్యోగులకు ఎంత జీతం లభిస్తుందో తెలుసా ? ఆశ్చర్యపరుస్తున్న వివరాలు..

By asianet news telugu  |  First Published Jul 24, 2023, 1:09 PM IST

ఈ డేటాలో 12,000 కంటే ఎక్కువ US ఉద్యోగుల నుండి సమాచారాన్ని కలిగి ఉంది. ఈ లిస్ట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బిజినెస్ అనలిస్ట్స్  అండ్  సేల్స్ పర్సన్స్ ఉన్నారు. 


ఉద్యోగులకు అత్యధికంగా చెల్లించే టెక్ కంపెనీలలో గూగుల్ ఒకటి. గూగుల్ ఉద్యోగులకు అధిక వేతనాలు చెల్లిస్తోందని  విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. Google సాలరీ  ఒక ఇంగ్లీష్  వెబ్ సైట్  ద్వారా విడుదల చేయబడింది. నివేదిక ప్రకారం, 2022లో, వీరు సగటున $279,802 పరిహారం పొందారు.

Google ఉద్యోగుల మధ్య భాగస్వామ్యం చేయబడిన ఇంటర్నల్  స్ప్రెడ్‌షీట్‌ను ఉటంకిస్తూ ఒక మూలం ప్రకారం, కంపెనీలోని వివిధ పొజిషన్ల  జీతం స్కేల్ వెల్లడైంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గూగుల్‌లో అత్యధిక వేతనం పొందుతున్నారు. 2022లో గరిష్ట మూల వేతనం $718,000.  

Latest Videos

ఈ డేటాలో 12,000 కంటే ఎక్కువ US వర్కర్ల నుండి సమాచారాన్ని కలిగి ఉంది. ఈ లిస్ట్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బిజినెస్ అనలిస్ట్స్,  సేల్స్ పీపుల్స్  ఉన్నారు. డేటాను పరిశీలిస్తే, Googleలో ఇంజనీరింగ్, బిజినెస్ అండ్  సేల్స్ అత్యధికంగా చెల్లించే 10 పొజిషన్స్ ఆరు-అంకెల బేస్ వేతనాలను కలిగి ఉన్నాయి.

ఆసక్తికరంగా, Google కంపేన్సేషన్  స్ట్రక్చర్  స్టాక్ అప్షన్స్ అండ్ బోనస్‌లను కలిగి ఉంటుంది. 2022లో గూగుల్‌లో అత్యధిక బేస్ వేతనాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (5.90 కోట్లు), ఇంజనీరింగ్ మేనేజర్ (3.28 కోట్లు), ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్ (3.09 కోట్లు), లీగల్ కార్పొరేట్ కౌన్సెల్ 2.62 కోట్లు, సేల్స్ స్ట్రాటజీ 2, 2.8 కోట్లు అండ్ 2.6 కోట్లు. ప్రభుత్వ వ్యవహారాలు & పబ్లిక్ పాలసీ (2.56 కోట్లు), రీసెర్చ్ సైంటిస్ట్ (2.53 కోట్లు), క్లౌడ్ సేల్స్ (2.47 కోట్లు), ప్రోగ్రామ్ మేనేజర్ (2.46 కోట్లు) కూడా లిస్ట్  ఉన్నారు. ఈ డేటా US ఫుల్ టైం ఉద్యోగులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆల్ఫాబెట్ ఇతర వెంచర్‌ల నుండి  జీతాల వివరాలు లేవు.

click me!