మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్.. iOS వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. కొత్త ఫీచర్‌ల జాబితాలో వీడియో కాల్‌ల కోసం ల్యాండ్‌స్కేప్ మోడ్ సపోర్ట్ కూడా ఉంది.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్.. iOS వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. కొత్త ఫీచర్‌ల జాబితాలో వీడియో కాల్‌ల కోసం ల్యాండ్‌స్కేప్ మోడ్ సపోర్ట్ కూడా ఉంది. వీడియో సంభాషణల సమయంలో వినియోగదారులు మరింత లీనమయ్యే అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ మేరకు కంపెనీ నుంచి ప్రకటన వెలువడింది. ఇక, వీడియో కాలింగ్ సమయంలో ల్యాండ్ స్కేప్ మోడ్‌ను వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఫీచర్ అన్న సంగతి తెలిసిందే.
ఇక, వాట్సాప్ ఇటీవలికాలంలో చాట్ బదిలీ, యాప్‌లోనే స్టిక్కర్స్, వీడియో కాల్‌ల కోసం ల్యాండ్‌స్కేప్ మోడ్, గుర్తుతెలియని కాల్స్ మోడ్‌లో పెట్టేందుకు వీలుగా ఫీచర్స్ తీసుకొచ్చింది. అయితే ఐవోఎస్ వినియోగదారులకు ఈ ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. చాట్ బదిలీ విషయానికి వస్తే.. ఇది కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారే వాట్సాప్ వినియోగదారుల కోసం సున్నితమైన పరివర్తన ప్రక్రియను సృష్టిస్తోంది. దీనిని సెట్టింగ్‌లు - చాట్‌లు - ఐఫోన్‌కి చాట్‌లను బదిలీ చేయడం ద్వారా కొత్త ఫీచర్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
undefined
ఇదిలాఉంటే, పునరుద్ధరించబడిన స్టిక్కర్ ట్రే ద్వారా.. వాట్సాప్‌లో మరింత సులువుగా, ఆకర్షణీయంగా మెసేజ్‌లు పంపించేందుకు వీలవుతుందని సంస్థ చెబుతోంది. ఈ ఫీచర్ స్టిక్కర్, అవతార్, జిఫ్ పిక్‌లను రీడిజైన్ చేస్తోంది. తద్వారా వినియోగదారులు వారి భావోద్వేగాలను మరింత సులభంగా వ్యక్తీకరించగలరు.
ఇక, గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను అడ్డుకునేందుకు సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారులు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కిందకు స్క్రోల్ చేస్తే ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వచ్చే జాబితాలో కాల్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ 'సైలెన్స్ అన్ నోన్ కాలర్స్' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.