భూమిని కూడా స్కాన్ చేసి పసిగట్టేస్తుంది.. హై సెక్యూరిటితో అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవం..

By Ashok kumar Sandra  |  First Published Jan 17, 2024, 5:00 PM IST

ఈ స్టార్ట్-అప్ 99.7 శాతం ఖచ్చితత్వంతో 8,00,000 మంది నేరస్థుల డేటాబేస్‌ను ఉపయోగించుకోవడానికి UP పోలీసులతో కలిసి పనిచేసింది. ఇంకా రియాల్ టైంలో   లైవ్  కెమెరాలలో అతని/ఆమె ఫోటోను ఉపయోగించి అనుమానిత  వ్యక్తిని (POI) కూడా వెతుకుతుంది.


 ఈ నెల జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు ఈ పుణ్య క్షేత్త్రంలో భద్రతను పెంచడానికి ప్రభుత్వం అనేక టెక్ కంపెనీలతో కలిపింది. గుర్గావ్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ Staqu Technologies మెరుగైన భద్రత కోసం అయోధ్యలో ఉన్న సీసీ కెమెరాలలో జార్విస్ అనే AI- పవర్డ్ ఆడియో-వీడియో అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

ఈ సాఫ్ట్‌వేర్ వీడియో ఫుటేజీని రియల్ సమయంలో విశ్లేషిస్తుంది ఇంకా  అనుమానాస్పద కార్యాచరణ అలాగే   ప్రమాదాలను గుర్తిస్తుంది ఇంకా  వెంటనే అధికారులను హెచ్చరిస్తుంది. జనవరి 22న నగరంలోకి  వేలాది మంది భక్తులు వస్తారని భావిస్తున్న తరుణంలో ఈ చర్య   జరిగింది.

Latest Videos

ఈ స్టార్ట్-అప్ 99.7 శాతం ఖచ్చితత్వంతో 8,00,000 మంది నేరస్థుల డేటాబేస్‌ను ఉపయోగించుకోవడానికి UP పోలీసులతో కలిసి పనిచేసింది. ఇంకా రియాల్ టైంలో   లైవ్  కెమెరాలలో అతని/ఆమె ఫోటోను ఉపయోగించి అనుమానిత  వ్యక్తిని (POI) కూడా వెతుకుతుంది.

లేటెస్ట్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) సామర్థ్యాలతో కూడిన కెమెరాలు దొంగిలించబడిన వాహన డేటాబేస్‌తో సహా ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇంకా  రియల్ టైమ్‌లో నకిలీ నంబర్ ప్లేట్‌లు ఉన్న వాహనాలను గుర్తించడానికి అధికారులకి సహాయపడుతుంది. దీనితో పాటు దుస్తులు, రంగు, ఉపకరణాలు లేదా పిల్లలతో పాటు వంటి నిర్దిష్ట లక్షణాల ఆధారంగా గుంపు నుండి వ్యక్తులను గుర్తించడానికి కూడా అధికారులకి ఉపయోగపడతుంది.

ముఖ్యంగా కనక్ భవన్, హనుమాన్ గర్హి, శ్రీ నాగేశ్వర్ నాథ్ మందిర్, రామ్ కి పైడి అండ్  రామ జన్మభూమితో సహా అయోధ్యలోని ప్రసిద్ధ హాట్‌స్పాట్‌లలో స్టాకుస్ జార్విస్ అమర్చారు.

దీనికి తోడు యూపీ పోలీసులు అయోధ్యలో యాంటీ మైన్ డ్రోన్‌లను కూడా మోహరించారు. ఈ AI-శక్తితో నడిచే డ్రోన్‌లు అధునాతన సెన్సార్‌లు ఇంకా డిటెక్షన్ టెక్నాలజ  ఉండి, దాచిన ల్యాండ్‌మైన్‌లు లేదా పేలుడు పరికరాల కోసం భూమిని స్కాన్ చేయడానికి, పవిత్ర నగరాన్ని సందర్శించడానికి వచ్చే  లక్షలాది మంది భక్తులను కాపాడతాయి.

UP పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం, “స్పెక్ట్రోమీటర్ వేవ్ లెంగ్త్ డిటెక్షన్‌లో సహాయపడే ప్లేట్ దాని క్రింద ఉంది. ఈ డ్రోన్ భూమి కింద ఉన్న ప్రాంతాన్ని స్కాన్ చేస్తుంది. ఈ డ్రోన్ ద్వారా, గనులు లేదా పేలుడు పదార్థాలను  ఉన్న ప్రాంతాల్లో గుర్తించి స్యూట్ట్రలైజ్ చేస్తుంది.

click me!