ప్రీకాషన్: ‘గూగుల్‌’ ప్లేస్టోర్‌ నుంచి 85 యాప్స్‌ తొలగింపు

By sivanagaprasad kodati  |  First Published Jan 11, 2019, 8:38 AM IST

వివిధ అధ్యయనాలతో సెర్చింజన్ ‘గూగుల్’ అప్రమత్తమైంది. మొబైల్ వినియోగంలో వివిధ యాప్‌ల వల్ల డేటా భద్రతకు భంగం వాటిల్లుతుందని తేలడంతో గూగుల్ తన ప్లే స్టోర్‌లో రమారమీ 85 యాప్‌లను తొలిగించి వేసింది.  
 


సెర్చింజన్ ‘గూగుల్’ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. మొబైల్‌లో వినియోగదారుల డేటా భద్రతకు హాని కలిగించే 85 యాప్‌లను తమ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. గేమ్‌, టీవీ, రిమోట్‌ కంట్రోల్‌ సిమ్యులేటర్‌ కేటగిరీలో ఉండే యాడ్‌వేర్‌ ఫ్యామిలీకి చెందిన ఈ యాప్‌లతో డేటా భద్రతకు భంగం కలుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతో ఈ యాప్‌లను గూగుల్‌ తొలగించింది.

‘ఈ యాడ్‌వేర్‌ ద్వారా మొబైల్‌లో ప్రకటనలు ఫుల్‌ స్క్రీన్‌లో కన్పిస్తాయి. ఆ సమయంలో ఈ యాప్‌లు ప్రకటన కింద దాగి మొబైల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తాయి. వీటి వల్ల ఫోన్‌ డేటా భద్రతకు భంగం కలుగుతుంది’ అని ట్రెండ్‌ మైక్రో ఇటీవల తన బ్లాగ్‌లో పేర్కొంది. 

Latest Videos

undefined

ఈ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో 90లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. గూగుల్‌ తొలగించిన 85 యాప్‌లలో ‘ఈజీ యూనివర్సల్ టీవీ రిమోట్’ యాప్‌ ఒకటి. దీన్ని అత్యధికంగా 50 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపెన్‌ చేసిన తర్వాత డిస్‌ప్లే పైన ఫుల్‌ స్క్రీన్‌ పాప్‌-అప్‌ బాక్స్‌ వస్తుంది. 

దానిపై కంటిన్యూ అనే బటన్‌ను నొక్కితే మళ్లీ యాడ్‌తో కొత్త పేజీ వస్తుంది. అలా చాలా సార్లు కంటిన్యూ బటన్‌ వచ్చిన తర్వాత యాప్‌ క్రాష్ అవుతుంది. అయితే మనం ఈ యాడ్‌లను చూస్తున్న సమయంలో సదరు యాప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. 

మొబైల్‌ స్క్రీన్‌ అన్‌లాకింగ్‌ యాక్షన్‌ను తస్కరించి మనం ఫోన్‌ను లాక్‌ చేసిన ప్రతిసారీ ప్రకటనలు చూపుతూ ఉంటుంది. వీటి వల్ల మొబైల్‌ డేటాకు ప్రమాదమని అధ్యయనాలు చెప్పడంతో గూగుల్‌ వీటిని తొలగించింది. ఈ జాబితాలో స్పోర్ట్‌ టీవీ, టీవీ రిమోట్‌, ఏసీ రిమోట్‌, లవ్‌ స్టికర్‌, రిమోట్‌ కంట్రోల్‌, పార్కింగ్‌ గేమ్‌, వరల్డ్‌ టీవీ తదితర 85 యాప్‌లు ఉన్నాయి.

click me!