మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి; లేదంటే వాట్సాప్‌ చాట్ లీక్ ..

By asianet news teluguFirst Published Aug 3, 2023, 1:10 PM IST
Highlights

వాట్సాప్ ద్వారానే ఈ ఫేక్ యాప్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత సేఫ్ చాట్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సర్కులేట్ అవుతున్న కొన్ని ఇతర నకిలీ అప్లికేషన్‌ల లాగానే  ఉంటుంది. కానీ ఇది ఇప్పటికే  ఉన్న నకిలీలకు ఫోన్‌లలో ఎక్కువ పెర్మిషన్ పొందడంతో పెద్ద ముప్పును కలిగిస్తుంది.

వాట్సాప్‌తో సహా వివిధ అప్లికేషన్‌ల నుండి సమాచారాన్ని లీక్ చేసే ఫెక్  అప్లికేషన్‌లకు వ్యతిరేకంగా హెచ్చరిక. దక్షిణాసియాలోని ఆండ్రాయిడ్ యుజ్లర్లను  లక్ష్యంగా చేసుకుని 'సేఫ్ చాట్' అనే చాటింగ్ అప్లికేషన్ యూజర్ల వాట్సాప్ సమాచారాన్ని హ్యాకర్లకు లీక్ చేస్తున్నట్టు తేలింది. వాట్సాప్ యూజర్లకు పీడకలగా మారుతున్న కొత్త సెక్యూరిటీ  ముప్పు గురించి సైబర్ సెక్యూరిటీ సంస్థ 'సైఫెమా' నిపుణులు తెలియజేశారు.

వాట్సాప్ ద్వారానే ఈ ఫేక్ యాప్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత సేఫ్ చాట్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సర్కులేట్ అవుతున్న కొన్ని ఇతర నకిలీ అప్లికేషన్‌ల లాగానే  ఉంటుంది. కానీ ఇది ఇప్పటికే  ఉన్న నకిలీలకు ఫోన్‌లలో ఎక్కువ పెర్మిషన్ పొందడంతో పెద్ద ముప్పును కలిగిస్తుంది. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్, వైబర్ ఇంకా ఫేస్‌బుక్ మెసెంజర్ వంటి మెసేజింగ్ అప్లికేషన్‌ల నుండి సమాచారాన్ని లీక్ చేసే Coverlm అనే మాల్వేర్ యొక్క మరొక వెర్షన్ కొత్త అప్లికేషన్ అని చెబుతున్నారు. 

హై సెక్యూర్ మెసేజెస్ వాగ్దానం ద్వారా యూజర్లు ఆకర్షితులవుతారు. సేఫ్ చాట్ అప్లికేషన్ WhatsApp కంటే సురక్షితమైన చాటింగ్ అందించే మెసేజ్ తో  వస్తుంది. మొదటి చూపులో ఇన్‌స్టాలేషన్ తర్వాత ఇది సాధారణ చాటింగ్ యాప్‌లా కనిపిస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది కూడా ఎప్పటికీ ఫేక్ అప్లికేషన్ లాగా అనిపించదు. అప్పుడు మీరు సేఫ్ చాట్ లోగోతో మెయిన్ మెనూని పొందుతారు ఇంకా వివిధ పర్మిషన్ కోసం అడుగుతుంది.

యాక్సెసిబిలిటీ సర్వీస్‌లలో కాంటాక్ట్ లిస్ట్, SMS, కాల్ లాగ్‌లు, ఎక్స్టెర్నల్ డివైజ్  స్టోరేజ్  అండ్ GPS లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సబ్‌సిస్టమ్‌లో కన్సెషన్ అంగీకరించడానికి అనుమతిని కూడా అడుగుతుంది. ఈ అనుమతులు ఇవ్వడం ద్వారా, హ్యాకర్లు మీ ఫోన్‌ను కంట్రోల్ చేయగలరు. కానీ ఈసారి మీరు ఇప్పుడు సేఫ్  చాట్ చేయగలరని వాగ్దానం చేసే స్క్రీన్ కనిపిస్తుంది. ఫోన్‌లో అప్లికేషన్ రన్ అవుతున్నంత కాలం హ్యాకర్లు ఫోన్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. 

click me!