టీకెట్ క్యాన్సల్ చేస్తే ఫ్రీ ఫుడ్; జనవరి 31st వరకు ఆఫర్..

Published : Jan 20, 2024, 11:20 AM IST
 టీకెట్   క్యాన్సల్ చేస్తే ఫ్రీ ఫుడ్; జనవరి 31st  వరకు ఆఫర్..

సారాంశం

నోయిడా అండ్ ఘజియాబాద్‌కు చెందిన రెస్టారెంట్ చైన్ 'మిస్టర్ బతురా' (Mr. Batura)తన కస్టమర్ల  కోసం విచిత్రమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మాల్దీవులకు క్యాన్సల్ చేసిన  టికెట్ రుజువును చూపితే 'చోలే బతురా' (Chole bhature)ప్లేట్ ఉచితంగా ఇవ్వబడుతుంది. 

భారతదేశం అండ్  మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, ఇజ్రాయెల్ సహా దేశాలు భారతదేశానికి  మద్దతును ప్రకటించాయి. మరోవైపు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వివిధ కంపెనీలు లక్షద్వీప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

అంతేకాకుండా, ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ EasyMyTrip మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేసింది. ఇప్పుడు, నోయిడాలోని ఒక రెస్టారెంట్ దేశానికి సంఘీభావం తెలిపేందుకు ఒక చమత్కారమైన మార్గాన్ని కనుగొంది. అది ఏంటంటే ?

నోయిడా అండ్ ఘజియాబాద్‌కు చెందిన రెస్టారెంట్ చైన్ 'మిస్టర్ బతురా' (Mr. Batura)తన కస్టమర్ల  కోసం విచిత్రమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మాల్దీవులకు క్యాన్సల్ చేసిన  టికెట్ రుజువును చూపితే 'చోలే బతురా' (Chole bhature)ప్లేట్ ఉచితంగా ఇవ్వబడుతుంది.

లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నామని ఈ రెస్టారెంట్ పేర్కొంది. ఈ ఆఫర్‌ను శనివారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు కొంత మంది సద్వినియోగం చేసుకున్నారని రెస్టారెంట్ తెలిపింది. జనవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రెస్టారెంట్ యజమాని విజయ్ మిశ్రా తెలిపారు. 

భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో భారత్, మాల్దీవుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో భారతదేశంలో #BoycottMaldives ప్రచారం ప్రారంభమైంది. 

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?