ఆ వీడియో క్లిప్‌ వల్ల ఉద్యోగం పోయింది.. క్షమించండి అంటూ ఉద్యోగి..

By Ashok kumar SandraFirst Published Jan 20, 2024, 10:54 AM IST
Highlights

తాజాగా పోస్ట్ చేసిన తన  వీడియో ద్వారా లేవనెత్తిన ఫిర్యాదులే తన తొలగింపుకు కారణమని స్వయంగా అతనే చెప్పాడు. అలాగే ఏడేళ్ల పాటు సాగుతున్న పని ముగియనుందని వివరించారు. 
 

పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయనేది ఇప్పుడు సాధారణ వార్త అయితే, టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన వీడియో కారణంగా తన ఉద్యోగం కోల్పోయానని ఒక అమెజాన్ ఉద్యోగి ఫిర్యాదుతో ముందుకు వచ్చాడు. పెద్దపెద్ద బాక్సులు  మోసుకెళ్లి విసిగిపోయానని సరదాగా పోస్ట్ చేసిన వీడియోలను కెండాల్ అనే యువకుడు వెల్లడిస్తాడు. అతను @thatamazonguyy IDతో Tik Tokలో వీడియోలను పోస్ట్ చేసాడు. అతనికి 35,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్  ఉన్నారు.

అమెజాన్ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న అతను వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో తాను లేవనెత్తిన ఫిర్యాదులే తన తొలగింపుకు కారణమని స్వయంగా అతనే చెబుతున్నాడు. అలాగే ఏడేళ్ల పాటు సాగుతున్న పని  ముగియనున్నాట్లు  వివరించారు. 

"నేను నాలుగు వారాల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసాను, అందులో నేను అమెజాన్ నుండి  వస్తువులను ఎవ్వరూ ఎప్పుడూ కొనుగోలు చేయకూడదని చెప్పాను, ఎందుకంటే వాటిని తీసుకువెళ్లడం, ఉంచడం ద్వారా నేను విసిగిపోయారు, చాలా మంది దీనిని జోక్ అని అనుకున్నారు, కానీ కొంతమందికి అర్థం కాలేదు. చాలా మంది దీనిని జోక్‌గా తీసుకున్నారు కానీ Amazonలో పని చేసే వారు ఎవరైనా అర్థం చేసుకుంటారు.నేను అతిశయోక్తి చేసాను.ఆ వీడియో చూసి చాలా మంది బాధపడ్డారు.మీకు అలా అనిపిస్తే క్షమించండి.నా ఉద్దేశ్యంలో ఎవరిపై వివక్ష చూపడం లేదా బాధపెట్టడం లేదు. నేను ఇప్పటికే నా ఉద్యోగాన్ని కోల్పోయాను. దాన్ని తిరిగి పొందే మార్గం లేదు. కాబట్టి నన్ను క్షమించండి. అని అన్నారు. 

తన చాలా వీడియోలలో అతను అమెజాన్ నుండి త్రాగునీటి సీసాలు, పెంపుడు జంతువుల ఆహారాన్ని కొనుగోలు చేసే వ్యక్తులను ఎగతాళి చేశాడు. ఇలా నీళ్లు కొనుక్కున్న వారికి నీళ్లు వచ్చేంత వరకు తాగవద్దని వీడియోలు చేయడంతో చివరకు పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై స్పందించేందుకు అమెజాన్ సిద్ధంగా లేదు.

click me!