ఎలోన్ మస్క్ కీలక ప్రకటన: ట్విట్టర్‌ కొనుగోలుకి వేల కోట్ల ఆఫర్.. ఒక్కో షేరుకు భారీగా చెల్లింపు..

By asianet news telugu  |  First Published Apr 14, 2022, 6:00 PM IST

తాజాగా ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు  ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాడు. ఇందుకోసం 41.39 బిలియన్ డాలర్లు (రూ. 3.2 లక్షల కోట్లు) నగదు రూపంలో చెల్లిస్తానని తెలిపారు. 


ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ గురువారం మైక్రో బ్లాగ్గింగ్ ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ కొనుగోలు పై భారీ ఆఫర్‌తో సంచలనం సృష్టించారు. నిజానికి ఇటీవలే ట్విటర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాడు. ఇందుకోసం 41.39 బిలియన్ డాలర్లు (రూ. 3.2 లక్షల కోట్లు) నగదు రూపంలో చెల్లిస్తానని చెప్పారు. 

ఒక్కో షేరుకు 54.20 డాలర్లు 
ఒక నివేదిక ప్రకారం ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్ కింద ఎలోన్ మస్క్ Twitter ప్రతి షేరుకు 54.20 డాలర్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాట్లు తెలిపారు. 50 ఏళ్ల ఎలోన్ మస్క్ గురువారం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో ఈ ప్రతిపాదన గురించి సమాచారం అందించినట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ ప్రకటన తర్వాత ట్విట్టర్ షేర్లు బుధవారం 3.10 శాతం వరకు పెరిగి  45.85 డాలర్ల వద్ద ముగిశాయి.

Latest Videos

undefined

ట్విట్టర్‌ అసాధారణ శక్తి 
ఇటీవల ట్విట్టర్‌లో వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఎలోన్ మస్క్ Twitter బోర్డులో చేరాలనే ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఒక నివేదిక పేర్కొంది. బోర్డుకు రాసిన లేఖలో తన కోరికను వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ స్వేచ్ఛ పరంగా అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉందని, దాని పరిధి విస్తరించిందని, నేను దానిని అన్‌లాక్ చేయాలనుకుంటున్నాను అని అన్నారు.

ట్విట్టర్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత
కంపెనీ ఈ సామాజిక ఆవశ్యకతను ప్రస్తుత రూపంలో ఇంకా అభివృద్ధి చేయలేకపోయిందని నేను గ్రహించాను. ట్విట్టర్‌ని ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అని తెలిపారు.

నా ఆఫర్ ఉత్తమమైనది ఇంకా చివరిది
ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి నేను చేసిన ఈ ఆఫర్ నా ఉత్తమ ఇంకా చివరి ఆఫర్, దానిని బోర్డు అంగీకరించకపోతే కంపెనీ వాటాదారుగా నా స్థానం గురించి నేను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని టెస్లా సి‌ఈ‌ఓ అన్నారు.
 
Refinitiv డేటా ప్రకారం మొత్తం డీల్ విలువ 763.58 మిలియన్ షేర్ల ఆధారంగా లెక్కించబడింది. కంపెనీలో తన వాటాను వెల్లడించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో ట్విటర్ బోర్డులో చేరాలనే ప్రతిపాదనను ఎలోన్ మస్క్ తిరస్కరించారు.  విశ్లేషకులు మాట్లాడుతూ ట్విట్టర్ బోర్డు మెంబర్ గా తన వాటాను కేవలం 15% కంటే తక్కువకు పరిమితం చేసిందని విశ్లేషకులు తెలిపారు. ఈ ఆఫర్‌కు మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారి అని ఎలోన్ మస్క్ తెలిపారు. ఎలోన్ మస్క్ 2009లో  ట్విట్టర్ లో చేరినప్పటి నుండి 80 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు.

click me!