గూగుల్ రహస్యంగా ఈ యాప్‌ను లాంచ్ చేసింది.. ఆండ్రాయిడ్ ప్రియులకు గొప్ప గిఫ్ట్..

By asianet news telugu  |  First Published Apr 14, 2022, 5:24 PM IST

స్విచ్ టు ఆండ్రాయిడ్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. యాప్ డిస్క్రిప్షన్ తో పాటు ఎలా మారాలి అనే సమాచారం కూడా ఇచ్చారు.


టెక్ దిగ్గజం గూగుల్ రహస్యంగా 'స్విచ్ టు ఆండ్రాయిడ్' అనే యాప్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌కి మారాలనుకునే అంటే ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్‌కి రావాలనుకునే ఐఓఎస్ వినియోగదారుల కోసం ఈ యాప్ ప్రత్యేకంగా ప్రారంభించారు. గూగుల్ 'Switch to Android' యాప్ వైర్‌లెస్‌గా పనిచేస్తుంది, అంటే దాని ద్వారా డేటాను బదిలీ చేయడానికి కేబుల్ కూడా అవసరం లేదు.

ఈ యాప్‌కు సంబంధించి iOS నుండి Androidకి డేటా బదిలీ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని Google పేర్కొంది. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా డేటాను బదిలీ చేయడానికి ఎక్కువ సమయం  కూడా పట్టదు. స్విచ్ టు ఆండ్రాయిడ్ యాప్ యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. యాప్  డిస్క్రిప్షన్ తో పాటు ఎలా మారాలి అనే సమాచారం కూడా ఇచ్చారు.
 
డేటా బదిలీ సమయంలో వినియోగదారులు కాంటాక్ట్స్ నుండి క్యాలెండర్, ఫోటోలు-వీడియోలకు ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ సైజ్ 39MB, దీనిని iOS 12.0 లేదా తర్వాతి వెర్షన్‌ ఉన్న  iPhoneలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు iOS నుండి Androidకి మారడానికి ప్రత్యక్ష మార్గం లేదు. యాపిల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి మారే అవకాశం ఉంది.

Latest Videos

కొన్ని రోజుల క్రితం యాపిల్, శాంసంగ్ తర్వాత ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల కోసం సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. Google Pixel వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్‌ను స్వంతంగా రిపేర్ చేయవచ్చు. దీని కోసం ఆన్‌లైన్ రిపేర్ కమ్యూనిటీ iFixitతో Google భాగస్వామిగా ఉంది. సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రామ్ కింద కస్టమర్‌లకు వారి ఫోన్‌లను రిపేర్ చేయడానికి దశల వారీ ప్రక్రియ అందిస్తారు. అవసరాన్ని బట్టి, వినియోగదారులు గూగుల్ స్టోర్ నుండి ఫోన్ వీడి భాగాలను కూడా కొనుగోలు చేయవచ్చు.

click me!