ఎలక్ట్రానిక్ కంపెనీ ఐవా తాజాగా 6 ఆడియో ఉత్పత్తులను ఇండియాలో లాంచ్ చేసింది. అయితే 2019లోనే టివి, స్పీకర్లతో మొదటిసారి ఐవా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది.
జపాన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ ఐవా 2019 సంవత్సరంలో టివి, స్పీకర్లతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మళ్ళీ ఇప్పుడు రెండేళ్ల తరువాత ఐవా సంస్థ ఆడియో డివైజెస్ తో భారత మార్కెట్లో రిఎంట్రీ ఇచ్చింది. ఐవా భారతదేశంలో నెక్‌బ్యాండ్, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వీటి ధరలు 699 రూపాయల నుండి ప్రారంభమై 7,999 రూపాయల వరకు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం ...
ఐవా ఈఎస్‌బిటి 460 నెక్‌బ్యాండ్
ప్రీమియం నెక్‌బ్యాండ్ ఐవా ఈఎస్‌బిటి 460 లో క్వాడ్ డ్రైవర్, 8 ఎంఎం క్వాడ్ స్పీకర్ డ్రైవర్ ఉన్నాయి. దీనికి మెమరీ కార్డ్ స్లాట్‌ను కూడా లభిస్తుంది. దీని కనెక్టివిటీ పరిధి 10 మీటర్లు. హై బాస్ తో కూడిన ఐవా ఈఎస్‌బిటి 460లో నావిగేషన్ కోసం ఫిజికల్ బటన్లను కూడా అందించారు. దీని బ్యాటరీ 15 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ని రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ధర రూ .2,999.
ఐవా ఏటి -80ఎక్స్‌ఎఫ్‌ఏఎన్‌సి
ఆక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో వస్తున్న ఐవా ఏటి -80ఎక్స్‌ఎఫ్‌ఏఎన్‌సి ట్రు వైరల్ ఇయర్‌బడ్‌లు . దీనికి కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఉంది. దీని పరిధి కూడా 10 మీటర్లు. అలాగే ఇందులో నాయిస్ క్యాన్సలేషన్ 23-25 డిబి వరకు ఉంటుంది. వీటికి ఆటోమేటిక్ పెరింగ్ కూడా ఉంది. ఛార్జింగ్ కేసుతో బ్యాటరీ 16 గంటల బ్యాకప్‌ను క్లెయిమ్ చేసింది. వీటిని నలుపు, తెలుపు రంగులలో 7,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
also read
ఐవా ఏటి -ఎక్స్80ఈ ఇయర్‌ఫోన్‌లు
ఐవా ఏటి -ఎక్స్80ఈ అనేది ఇన్‌బిల్ట్ మైక్ , ఎల్‌ఈడి డిస్ ప్లే కలిగిన ట్రు వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్. ఇది హెచ్‌డి ఆడియో క్వాలిటి అందిస్తుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 ఉంది. దీని బ్యాటరీ 6 గంటల బ్యాకప్, 70 రోజుల స్టాండ్ బై ఇస్తుంది. దీనిని నలుపు, తెలుపు రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ .1,999.
ఐవా ఈఎస్‌బిటి 401 నెక్‌బ్యాండ్
ఐవా ఈఎస్‌బిటి 401 నెక్‌బ్యాండ్ మైక్రోఫోన్ సపోర్ట్ తో వస్తున్నాన అల్ట్రా లైట్ నెక్‌బ్యాండ్. ఇది వాటర్ రెసిస్టెంట్ కోసం IPX5 గా రేట్ చేయబడింది. అలాగే హైపర్ బేస్ ఆడియోకు కూడా సపోర్ట్ ఇస్తుంది. దీన్ని రెండు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే బ్యాటరీ 8 గంటల బ్యాకప్ ఇస్తుంది. దీనికి సిలికాన్ డస్ట్ కవర్ తో మైక్రో యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. దీని ధర రూ .1,499.
ఐవా ఈఎస్‌టిఎం -101 ఇయర్ ఫోన్స్
ఈ వైర్ ఇయర్ ఫోన్లను ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 3.5 ఎంఎం పోర్టును, 3.5 ఎంఎం మెటల్ సిఎన్‌సి హౌసింగ్, 10 ఎంఎం నియోడైమియం స్పీకర్ డ్రైవ్ ఉంది. దీని బరువు 20 గ్రాములు. హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్ ఫీచర్‌తో దీని వైర్ పొడవు 1.2 మీటర్లు. దీని ధర రూ .699.