ప్రపంచంలోనే మొట్టమొదటి గేమింగ్ ఇయర్‌బడ్స్.. డ్యూయల్ ఆర్‌జి‌బితో వీటి కలర్స్ కూడా మార్చుకోవచ్చు..

Published : Apr 01, 2023, 03:07 PM IST
ప్రపంచంలోనే మొట్టమొదటి గేమింగ్ ఇయర్‌బడ్స్.. డ్యూయల్ ఆర్‌జి‌బితో వీటి కలర్స్ కూడా మార్చుకోవచ్చు..

సారాంశం

మివీ కమాండో X9 ధర రూ. 1,499గా ఉంచారు. దీనిని ఫ్లిప్‌కార్ట్ కాకుండా, కంపెనీ వెబ్‌సైట్ నుండి బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో అలాగే గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మివీ కమాండో X9 కేస్, పాడ్ రెండింటి రంగును కస్టమైజ్ చేసుకోవచ్చు.  

దేశీయ కంపెనీ మివీ(Mivi) కొత్త ఇయర్‌బడ్స్ మివీ కమాండో ఎక్స్9ని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. మివీ కమాండో X9కి సంబంధించి, డ్యూయల్ RGBతో వచ్చే ప్రపంచంలోనే మొట్టమొదటి గేమింగ్ ఇయర్‌బడ్స్ అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, మివీ కమాండో X9 పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి.

కొత్త ఇయర్‌బడ్స్  ధర రూ.1,499గా  ఉంచారు. ఫ్లిప్‌కార్ట్ కాకుండా, కంపెనీ వెబ్‌సైట్ నుండి బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో అండ్ గ్రే కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు. Mivi కమాండో X9 కేస్ ఇంకా పాడ్ రెండింటి కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు.

కమాండో X9 అరోరా లైట్స్ నుండి ప్రేరణ పొందింది. Mivi కమాండో X9లో 13ఎం‌ఎం డ్రైవర్ ఉంది, దీని ఫ్రీక్వెన్సీ 20Hz నుండి 20KHz వరకు ఉంటుంది. Mivi కమాండో X9 బ్యాటరీకి సంబంధించి 72 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేసింది.

10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 15 గంటల బ్యాకప్ ఉంటుందని చెబుతున్నారు. దీనికి గేమింగ్ కోసం 35ms అల్ట్రా లో లాటెన్సి ఉంది. అలాగే AAC ఇంకా SBC కోడెక్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

 ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) కూడా ఉంది. Mivi కమాండో X9 చెమట రిసిస్టంట్ కోసం IPX 4 రేటింగ్‌ను పొందింది. మెరుగైన కాలింగ్ కోసం క్వాడ్ మైక్‌ కూడా ఉంది.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!