జియో సినిమాకి పోటీగా హాట్‌స్టార్.. ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్, ఆసియా కప్ స్ట్రీమింగ్ కూడా ఫ్రీ...

By asianet news telugu  |  First Published Jun 10, 2023, 6:29 PM IST

డిస్నీ+ హాట్‌స్టార్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి అని కంపెనీ CEO సజిత్ శివానందన్ అన్నారు. ప్రస్తుత ఫ్రీ అనౌన్స్ మెంట్ జియో సినిమా ఎఫెక్ట్ అని మార్కెట్ లో టాక్ కూడా వినిపిస్తోంది. 
 


ముంబై: ఓటిటి  ప్లాట్‌ఫారమ్‌  డిస్నీ+హాట్‌స్టార్ ఆసియా కప్ అండ్ ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్ యాప్ వినియోగదారులందరికీ ఈ   లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన IPL మ్యాచ్‌లు, HBO కంటెంట్‌ను ఇప్పటివరకు అందించింది. జియో సినిమా ఎంటర్టైన్మెంట్లోకి   ప్రవేశించడంతో వ్యూస్  కొనసాగించడానికి రాబోయే పెద్ద ఈవెంట్‌లను  వినియోగదారులకు ఉచితంగా అందించడం మినహా డిస్నీ+హాట్‌స్టార్ కి వేరే మార్గం లేకుండా పోయింది. 

డిస్నీ+ హాట్‌స్టార్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి అని కంపెనీ CEO సజిత్ శివానందన్ అన్నారు. ప్రస్తుత ఫ్రీ అనౌన్స్ మెంట్ జియో సినిమా ఎఫెక్ట్ అని మార్కెట్ లో టాక్ వినిపిస్తోంది. 

Latest Videos

undefined

రిలయన్స్ జియో ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్ అండ్  అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సేవలకు పోటీగా ఉంది. IPL అండ్ HBO కంటెంట్‌తో పాటు, జియోసినిమా ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ OTT   రాబోయే సీజన్ స్ట్రీమింగ్‌ను కూడా ప్రకటించింది. జియోసినిమా వినియోగదారులందరికీ బిగ్ బాస్ OTT  24/7 స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందించడం కూడా ఆసక్తికరంగా మారింది.

అయితే ఇంతకుముందు JioCinema ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించింది. రూ.999 వార్షిక ప్లాన్ రేటుతో   దేశంలోని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన జియో సినిమా, హాలీవుడ్ కంటెంట్‌కు యాక్సెస్ అందించడం ద్వారా  ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించింది. జియోసినిమా అనేది FIFA వరల్డ్ కప్, IPL 2023   వంటి పాపులర్  కంటెంట్‌ను ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా వ్యువర్స్ సంపాదించుకున్న వేదిక.  

ఇది ది లాస్ట్ ఆఫ్ అస్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి షోలతో సహా HBOలో ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించబడింది. IPL తర్వాత కొత్త ప్లాన్ అమల్లోకి వస్తుంది. రూ. 999 ప్లాన్ కింద, JioCinema ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్‌లు వార్షిక ప్లాన్‌లో క్వాలిటీ వీడియో, ఆడియోను పొందుతారు. ఒకే సమయంలో గరిష్టంగా నాలుగు పరికరాలలో కంటెంట్‌ను ప్రసారం చేయగల మెరుగుదల కూడా ఉంది.

click me!