నిండుగా చీర కట్టుకున్నా... నగ్నంగా చూపించే యాప్ ఇది

Published : Jul 02, 2019, 11:28 AM IST
నిండుగా చీర కట్టుకున్నా... నగ్నంగా చూపించే యాప్ ఇది

సారాంశం

అమ్మాయిలు ఎప్పుడో  ఫ్రెండ్స్ తో సరదాగా దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి... వాటిని చూపించి బెదిరించే ఆకతాయిలు కోకల్లలు ఉన్నారు. అలాంటి వారికి మరింత రెచ్చగొట్టే యాప్ ఒదానిని ఓ సంస్థ తీసుకువచ్చింది.

ఎంత పద్ధతిగా చీర కట్టుకొని ఉన్న అమ్మాయి ఫోటోని అయినా... ఈ యాప్ నగ్నంగా చూపించేస్తుంది. ఇప్పటికే ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది ఈ యాప్. నిండుగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలను కూడా పూర్తి నగ్నంగా చూపించే యాప్‌ అది. దాని పేరు ‘డీప్‌న్యూడ్‌’. 

కృత్రిమ మేథ సాయంతో వినోదం కోసమే ఈ యాప్‌ను తయారు చేశామని తయారీ సంస్థ చెప్పినప్పటికీ దాన్ని చెడుగానే ఎక్కువగా వినియోగించే అవకాశం ఉందని నెటిజన్లు విరుచుకుపడ్డారు. దాంతో ఆ సంస్థ ‘డీప్‌న్యూడ్‌’ యాప్‌ను ఇంటర్నెట్‌ నుంచి తొలగించింది. అయితే, ఈ యాప్‌ను నెట్లో పెట్టిన కొద్దిసేపటికే 5 లక్షల మందికిపైగా వినియోగించారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

మీ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..? ఈ చిట్కాలు పాటిస్తే 2 నిమిషాల్లో 10-20GB ఎక్స్ట్రా స్పేస్
Smartphone: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌.. రూ. 15 వేలకే స్ట‌న్నింగ్ స్మార్ట్ ఫోన్