కస్టమర్లు ఉచితంగా 75జి‌బి డేటా పొందవచ్చు.. ఆ ఆఫర్ ఏంటో తెలుసా..?

By asianet news telugu  |  First Published Aug 16, 2022, 1:50 PM IST

వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లను ప్రారంభించలేదు కానీ రెండు పాత ప్లాన్‌లతో 75జి‌బి డేటా ఇస్తామని ప్రకటించింది. Vi రూ. 1,449 అండ్ రూ. 2,889 ప్లాన్‌ల గురించి మీకోసం. Vi రూ. 1,449 ప్లాన్‌ 180 రోజుల వాలిడిటీ అందిస్తుంది.


Vodafone Idea (Vi) కస్టమర్ల కోసం కొత్త ఆఫర్ బాక్స్  ఓపెన్ చేసింది. ఇండియాలో మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ Vi  ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 75జి‌బి అదనపు డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ కస్టమర్లను ఆకర్షించాలనుకుంటోంది. అయితే Vi ఈ ఆఫర్ రెండు  ప్రీ-పెయిడ్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. Vi ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 GB డేటా కూడా అందుబాటులో ఉంటుంది. వోడాఫోన్ ఐడియా  ఈ ప్లాన్ గురించి టెలికాం మొదట సమాచారం ఇచ్చింది.

Vodafone Idea ఈ రెండు ప్లాన్‌లతో 75జి‌బి వరకు అదనపు డేటా అందుబాటులో ఉంటుంది.
Vi కొత్త ప్లాన్‌లను ప్రారంభించలేదు కానీ రెండు పాత ప్లాన్‌లతో 75జి‌బి డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. Vi రూ. 1,449 అండ్ రూ. 2,889 ప్లాన్‌ల గురించి మీకోసం. Vi రూ. 1,449 ప్లాన్‌తో 180 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో ప్రతిరోజూ 1.5GB డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో రోజుకు 100 SMSలు కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో 50జి‌బి అదనపు డేటా  ఇస్తుంది, ఇది పూర్తిగా ఉచితం.

Latest Videos

undefined

ఇప్పుడు Vodafone Idea రూ. 2,889 ప్రీ-పెయిడ్ ప్లాన్ గురించి మాట్లాడితే ఈ ప్లాన్‌తో రోజుకు 100 SMSలు, ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది. దీనితో 75జి‌బి  అదనపు డేటా లభిస్తుంది. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వోడాఫోన్ ఐడియా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

మీరు Vi Hero అన్‌లిమిటెడ్ ఆఫర్ బెనెఫిట్స్ కూడా పొందవచ్చు 
 ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు హీరో అన్‌లిమిటెడ్ ఆఫర్‌ను కూడా పొందుతారు, ఇందులో వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగ్ ఆల్ నైట్ అండ్ డేటా డిలైట్ ఉన్నాయి. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ కింద కస్టమర్‌లు వారం చివరి వరకు మొత్తం వారంలోని మిగిలిన డేటాను ఉపయోగించవచ్చు. Binge All Night కింద కస్టమర్‌లు మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు హై-స్పీడ్ డేటాను ఉచితంగా ఉపయోగించవచ్చు ఇంకా డేటా డిలైట్స్ కింద, కస్టమర్‌లు ప్రతి నెలా 2జి‌బి అత్యవసర డేటాను పొందవచ్చు.

click me!