ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్: 30వేల డిస్కౌంట్ తో కొనేందుకు ఛాన్స్.. కొద్ది రోజులు మాత్రమే..

By asianet news telugu  |  First Published Jan 18, 2023, 6:35 PM IST

ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్‌బి‌ఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ తో రూ. 3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు ఇంకా EMI లావాదేవీలపై 10 శాతం అంటే రూ. 1,500 వరకు ఆదా చేయవచ్చు. 


మీరు ఆపిల్ మ్యాక్‌బుక్‌ను తక్కువ ధరకు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు మంచి ఛాన్స్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 అమెజాన్‌లో ప్రారంభమైంది. ఈ సెల్ జనవరి 20 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను 30 వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఉన్న మ్యాక్‌బుక్‌పై డిస్కౌంట్  ధర, బ్యాంక్ ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అంటే అమెజాన్ సేల్‌లో షాపింగ్ చేయడం ద్వారా మీరు చాలా వరకు ఆదా చేసుకోవచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్ పై  ఆఫర్లు
2020 ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్  ధర రూ. 99,900. అమెజాన్ గ్రేడ్ రిపబ్లిక్ డే సేల్‌లో 13 శాతం డిస్కౌంట్ తో రూ. 86,990 లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్‌బి‌ఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ తో రూ. 3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు ఇంకా EMI లావాదేవీలపై 10 శాతం అంటే రూ. 1,500 వరకు ఆదా చేయవచ్చు. ఇంకా ల్యాప్‌టాప్‌ను నెలకు రూ.4,156 సులభ EMIలో కూడా పొందవచ్చు.

Latest Videos

ఇది మాత్రమే కాదు, ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్ తో 17,300 రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే మీ ప్రస్తుత ల్యాప్‌టాప్‌ని ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా మీరు చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ రేటు పాత ల్యాప్‌టాప్ తయారీ ఇంకా మోడల్, దాని కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్లు ఇంకా ఎక్స్ఛేంజ్ తో Apple MacBook Airని రూ.66,690కి కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ మ్యాక్‌బుక్‌ ఎయిర్ ఫీచర్లు
Apple ప్రకారం, మ్యాక్‌బుక్‌ ఎయిర్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 13-అంగుళాల నోట్‌బుక్. దీనికి 13.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది, 2560x1600 పిక్సెల్‌లు రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో ఆపిల్ సొంత  ఇన్ హౌస్ ఆపిల్ ఎం1 ప్రాసెసర్  లభిస్తుంది. ఈ ప్రాసెసర్ వేగవంతమైనది ఇంకా 8 కోర్స్ పై పనిచేస్తుంది. దీనికి కస్టమ్ GPU, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, సెక్యుర్ ఎన్‌క్లేవ్ ఇంకా న్యూరల్ ఇంజిన్‌కు సపోర్ట్ ఉంది.

మ్యాక్‌బుక్‌ ఎయిర్ M1 49.9WHR బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది, ఇది వైర్‌లెస్ వెబ్ సర్ఫింగ్‌ పై 15 గంటల వరకు బ్యాకప్ అందించగలదని పేర్కొన్నారు.  ఇంకా 16జి‌బి ర్యామ్, 512జి‌బి వరకు SSD స్టోరేజ్ ఉంది. ఇతర కనెక్టివిటీ గురించి చెప్పాలంటే, బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫేస్‌టైమ్ హెచ్‌డి కెమెరా, రెండు స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, టచ్ ఐడికి సపోర్ట్ ఉంది. దీని బరువు 1.29 గ్రాములు.
 

click me!