చంద్రుడిపైకి వెళ్లనున్న బుల్లెట్ రైలు! ఆ దేశం అద్భుతమైన ప్లాన్.. మార్స్ పైకి మార్గం కూడా సులభం..

By asianet news telugu  |  First Published Jul 16, 2022, 4:55 PM IST

ఇప్పుడు మనిషి చంద్రునిపైకి సులభంగా వెళ్లగలడు. చంద్రుడిపైకే కాకుండా అంగారక గ్రహానికి ప్రయాణం సులభం కానుంది. జపాన్ దేశం ఈ ప్రణాళికపై పని చేస్తోంది. భూమి నుంచి చంద్రుడిపైకి జపాన్ బుల్లెట్ దూసుకుపోనుంది. అక్కడ నివసించడానికి క్యాప్సూల్ కూడా నిర్మించనుంది. 
 


 ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ భూమి కాకుండా ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నో రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఒకవైపు అమెరికా మళ్లీ చంద్రుడిపైకి వెళ్లే పనిలో పడింది. మరోవైపు అంగారకుడిపై నీటి అన్వేషణలో చైనా నిమగ్నమైంది. అదే సమయంలో చంద్రునిపైకి బుల్లెట్ రైలును నడపడానికి జపాన్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది ఒక కృత్రిమ అంతరిక్ష నివాసంలా( artificial space habitat) ఉంటుంది. మానవులు మరొక గ్రహానికి వెళ్లాలనే కల నెరవేరనుంది. జపాన్ ఈ భారీ ప్రణాళికను రూపొందించడానికి ప్రకటించింది. భూమి నుంచి చంద్రునిపైకి జపాన్ బుల్లెట్ రైలును నడపనుంది. ఇది విజయవంతమైతే అంగారకుడిపైకి కూడా నడిపే యోచనలో ఉంది. అక్కడ దిగేందుకు, బస చేసేందుకు క్యాప్సూల్‌  నిర్మించేందుకు బ్లూప్రింట్‌ కూడా సిద్దం చేస్తుంది. 

 ఈ ప్రణాళికతో పాటు, అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం, నివాసం నిర్మించనుంది, ఇక్కడ మానవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. చంద్రునిపై క్యాప్సూల్ నివాసం కూడా నిర్మించనుంది. మానవులు అటువంటి కృత్రిమ ప్రదేశంలో జీవిస్తారని, దీని వాతావరణం భూమిని పోలి ఉంటుందని దీని నుండి స్పష్టమవుతుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న చోట మనిషి ఎముకలు, కండరాలు బలహీనపడతాయని చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చూసుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే వాతావరణం ఏర్పడనుంది. 

Latest Videos

undefined

హాలీవుడ్ సినిమాల లాగానే కాలనీ 
ఒక నివేదిక ప్రకారం, అక్కడ లునా గ్లాస్ అని పిలవబడే స్థలం నిర్మించనుంది. గ్లాస్ ఒక పెద్ద కాలనీని పోలి ఉంటుంది. ఈ కాలనీ చంద్రుడు, అంగారక గ్రహంపై నిర్మించబడుతుంది, దీనిలో మానవులు నివసించగలరు. మీరు దాని లోపల ఉంటే స్పేస్ సూట్ ధరించాల్సిన అవసరం ఉండదు. మీరు బయట ఉంటే స్పేస్‌సూట్ ధరించడం తప్పనిసరి అవుతుంది. లోపలికి, బయటకు రావడానికి ప్రత్యేక గేటు కూడా ఏర్పాటు చేస్తారు. మీరు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల అభిమాని అయితే, జపాన్ ఎలాంటి  దారిలో ఉందో మీకు తెలిసి ఉండవచ్చు. 

మొత్తం 'క్యాప్సూల్' వాతావరణం భూమిలా ఉంటుందని
21వ శతాబ్దం చివరి నాటికి చంద్రుడు, అంగారకుడిపై మానవులు జీవించడం ప్రారంభిస్తారని జపాన్ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. క్యోటో విశ్వవిద్యాలయం అండ్ కజిమా కన్‌స్ట్రక్షన్ కలిసి ఈ ప్రణాళికను రూపొందించారు. చంద్రుడు, అంగారకుడిపై తయారు చేయబోయే ఈ 'గ్లాస్' శంఖువులా(cone) ఉంటుంది. ఇక్కడే మానవులు నివసిస్తారు. ఈ భవనం దాదాపు 1300 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి కృత్రిమ గురుత్వాకర్షణ(artificial gravity) ఉంటుంది. అలాగే మనుషులకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. ఆహార పదార్థాల నుంచి చెట్లు, మొక్కలు, నీరు, నదులు, ఉద్యానవనాలు, నీటి వనరులు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రజా రవాణా కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఏర్పాటు చేయనుంది.   

కాలనీ పేరు 
ఈ వార్త కొంత ఉత్సాహాన్ని నింపుతుంది కానీ దీన్ని పూర్తి చేయడానికి చాలా సమయం పట్టవచ్చు. దీని కోసం చాలా కాలం వేచి చూడాల్సిందే. దీని నమూనా 2050 నాటికి సిద్ధం కానుంది. ఇది పూర్తయ్యే వరకు మనం ఉండకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇది వాస్తవం. ఇప్పటి నుండే పనులు ప్రారంభమైతే, అది పూర్తి కావడానికి ఒక శతాబ్దం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చంద్రుడిపై ఏర్పడే ఈ 'గ్లాస్' కాలనీ పేరు లూనాగ్లాస్. మార్స్‌పై ఏర్పడే కాలనీని మార్స్‌గ్లాస్ అని పిలుస్తారు. 

క్యోటో యూనివర్శిటీ, కజిమా కన్స్ట్రక్షన్ కలిసి స్పేస్ ఎక్స్‌ప్రెస్ అనే బుల్లెట్ రైలులో పని చేయబోతున్నాయి. ఈ రైలు భూమి నుండి చంద్రునికి తరువాత అంగారక గ్రహానికి నడుస్తుంది. ఇది ఇంటర్‌ప్లానెటరీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్.  

click me!