యూ‌పి‌ఐ పేమెంట్ ఫెయిల్ అయ్యిందా.. అయితే ఈ విధంగా సోల్యూషన్ ఎంటో తెలుసుకోండి..

By asianet news telugu  |  First Published Jul 16, 2022, 4:27 PM IST

ఈ సమస్య మీకు తరచుగా జరుగుతుంది. UPI ద్వారా పేమెంట్ చేస్తున్నప్పుడు పేమెంట్ ఫెయిల్ అయ్యిందా. అయితే ఇప్పుడు ఈ సమస్య తీరనుంది. సెప్టెంబరు నుంచి ఈ సమస్య ఫిక్స్ అవుతుంది. ప్రస్తుతం కంపెనీ దీనిపై కసరత్తు చేస్తోంది. 


ప్రస్తుత యుగం డిజిటల్‌ యుగం. ప్రజలు వేగంగా డిజిటల్ వైపు మళ్లుతున్నారు. ఇప్పుడు డబ్బుల లావాదేవీలు కూడా ఆన్‌లైన్‌గా మారాయి. గతంల బ్యాంకుకు వెళ్లడం, గంటల తరబడి లైన్‌లో నిలబడడం, ఒక కౌంటర్‌ నుంచి మరో కౌంటర్‌కి వెళ్లడం.. ఈ తంటాలన్నీ ఇప్పుడు తీరిపోయాయి. ప్రజలు ఇంట్లో కూర్చొని పేమెంట్లు చేస్తున్నారు. మొబైల్‌లో షాపింగ్, మొబైల్ నుండి ఎవరికైనా చెల్లింపులు చేయడానికి UPIని ఉపయోగిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్యలో చాలా లోపాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఫెయిల్యూర్ కారణంగా పేమెంట్‌ చిక్కుకుపోవడం. అయితే ఇప్పుడు దానికి పరిష్కారం దొరికింది. 

పేమెంట్  ఫెయిల్యూర్ పై టెన్షన్ అవసరం లేదు. చెల్లింపు ఫెయిల్యూర్ అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా కాల్ సెంటర్‌కు కాల్ చేయాలి. కానీ ఇప్పుడు UPI చెల్లింపు విఫలమైతే, దానిని వెంటనే పరిష్కరించనుంది. అయ్తితే UPIని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తుంది. NPCI పేమెంట్  ఫెయిల్యూర్ పరిష్కరించే మార్గంలో ఉంది. UPI కోసం రియల్ టైమ్ పేమెంట్ రిజల్యూషన్ సిస్టమ్ డెవలప్ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో దిలీప్ అస్బే వెల్లడించారు. 

Latest Videos

ఒక నివేదిక ప్రకారం 
UPI చెల్లింపు విఫలమైతే వినియోగదారులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NPCI MD అండ్ CEO దిలీప్ అస్బే తెలిపారు. దీనికి తక్షణ పరిష్కారం లభిస్తుంది. UPI కోసం రియల్ టైమ్ పేమెంట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి పని జరుగుతోంది. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 2022 నాటికి అమలులోకి వస్తుంది. దీని ద్వారా UPI ద్వారా చెల్లింపు విఫలమైతే మీరు వెంటనే దానికి పరిష్కారాన్ని కూడా పొందుతారు. ఎవరికైనా డబ్బులు పంపే ముందు వెంటనే వెనక్కి వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. UPI సహాయం ద్వారా ఈ పని జరుగుతుంది. 

click me!