BSNL Fiber Broadband: రూ. 329కే 1TB డేటా మీ సొంతం.. ఈ ఛాన్స్ వారికి మాత్ర‌మే..!

By team telugu  |  First Published Mar 9, 2022, 4:20 PM IST

బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల పెంపును లక్ష్యంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త భారత్‌ ఫైబర్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్లను ప్రకటించింది.


దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త ఫైబర్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది. భారత సంచార్ నీగమ్ లిమిటెడ్ (BSNL) ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ఒకటి ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫైబర్ ప్లాన్ రూ. 329పై యూజర్లు 1TB వరకు డేటాను పొందవచ్చు. అలాగే 20Mbps స్పీడ్ పొందవచ్చు. అన్ని సర్కిళ్లలోని బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కాదండోయ్.. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని యూజర్లకు మాత్రమే ఈ డేటా ఫైబర్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మీ సర్కిళ్లలో కూడా ఈ BSNL ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందుబాటులో ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. BSNL Bharat Fibre వెబ్ పేజీ ద్వారా ఈ కొత్త BSNL Fiber Broadband Plan వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లు ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ఫ్రీ ఫిక్స్‌డ్‌ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్ తీసుకున్న యూజర్లకు మొదటి నెల బిల్లులో 90శాతం డిస్కౌంట్ అందిస్తామని BSNL టెలికం దిగ్గజం స్పష్టం చేసింది. గత ఏడాది దిగ్గజ ప్రైవేట్‌ టెలికాం సంస్థలు పోటీ పడుతూ మొబైల్‌ ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ కొత్త కస్టమర్లను యాడ్‌ చేసుకుంటుంది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ప్లాన్స్‌ను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌ బ్యాండ్‌ యూజర్లను దృష్టిలో ఉంచుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ అత్యంత చవకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.

Latest Videos

undefined

ఈ కొత్త ప్లాన్ రూ. 329 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ప్రవేశపెట్టడానికి ముందు రూ.449 డేటా ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద 30Mbps స్పీడ్ ఆఫర్ చేసింది. అలాగే 3.3TB ఇంటర్నెట్ డేటాను అందించింది. ఈ ప్లాన్ లోనూ ఇతర అదనపు బెనిఫిట్స్ ఒకేలా ఉన్నాయి. అయితే, కొత్త డేటా ప్లాన్ 329తో రీఛార్జ్ చేస్తే.. జీఎస్టీ ట్యాక్స్ కింద 18శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఈ ప్లాన్ ధర రూ.388 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

అంతకుముందు రూ.449 ప్లాన్, కొత్త ప్లాన్ రూ. 329 ప్లాన్లలో ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే వేరుగా ఉంది. మిగతా అదనపు బెనిఫిట్స్ అన్ని ఒకేలా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అదనంగా ఏ నెట్‌వర్క్‌కైనా Local‌, STD కాలింగ్‌ యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫైబర్‌ ఎంట్రీ ప్లాన్‌, ఫైబర్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఫైబర్‌ బేసిక్‌, ఫైబర్‌ బేసిక్‌ ప్లస్‌ ప్లాన్స్‌ కూడా అందిస్తోంది. అందులో నెలకు రూ. 399 నుంచి రూ. 599 అన్ని ఫైబర్ డేటా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్‌పై అదనపు డేటాతో పాటు OTT Services కూడా BSNL ఆఫర్ చేస్తోంది.

అంతేకాకుండా.. గ‌తంలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 197తో అన్ని సర్కిల్‌లలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. వినియోగదారులకు 150 రోజుల వ్యాలిడిటితో ఈ ప్లాన్ ఇవ్వబడింది. ఇందులో మొదటి 18 రోజుల పాటు 2GB హై-స్పీడ్ డేటా మాత్రమే ఇవ్వబడుతుంది. దీని తర్వాత, మిగిలిన వాలిడిటీలో 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తుంది. వినియోగదారులు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా పొందవచ్చు. అవుట్ గోయింగ్ కాల్స్ కోసం మాత్రం టాప్-అప్ చేయాల్సి ఉంటుంది. ఉచిత SMS సౌకర్యం కూడా ఈ ప్లాన్‌లో క‌ల్పించింది బీఎస్ఎన్ఎల్‌.

click me!