ఈ కొత్త ఫీచర్‌కి సైడ్-బై-సైడ్ మోడ్ అని పేరు పెట్టారు. ఈ మోడ్‌లో ఒకే స్క్రీన్‌లో మల్టి చాట్‌లను ఒకేసారి తెరవవచ్చు. సాధారణంగా ఒక చాట్ ఓపెన్ అయినప్పుడు మరో చాట్ విండో ఓపెన్ చేయడం కాకపోవచ్చు. ఇది ఒక విధంగా స్ప్లిట్ స్క్రీన్ లాగా ఉంటుంది.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌పై కసరత్తు చేస్తోంది. WhatsApp ఈ కొత్త అప్‌డేట్ వచ్చిన తర్వాత యూజర్లు ఒకేసారి మల్టి చాట్‌లను చూడవచ్చు ఇంకా చాట్ చేయవచ్చు. WhatsApp వెబ్‌లో కూడా వాట్సాప్ కొత్త అప్‌డేట్ రాబోతోంది. ఇది కాకుండా వాట్సాప్ ఈ మల్టీ విండో చాట్ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వినియోగదారులతో పరీక్షించడం జరుగుతోంది.
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ గురించి WABetaInfo సమాచారం ఇచ్చింది. కొత్త ఫీచర్‌కి సైడ్-బై-సైడ్ మోడ్ అని పేరు పెట్టారు. ఈ మోడ్‌లో, ఒకే స్క్రీన్‌లో మల్టి చాట్‌లను ఒకేసారి తెరవవచ్చు. సాధారణంగా ఒక చాట్ ఓపెన్ అయినప్పుడు మరో చాట్ విండో ఓపెన్ కాకపోవచ్చు. ఇది ఒక విధంగా స్ప్లిట్ స్క్రీన్ లాగా ఉంటుంది.
undefined
WABetaInfo కొత్త ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు. దీని కోసం వాట్సాప్ యాప్‌లో సెట్టింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సెట్టింగ్ కోసం, మీరు చాట్ సెట్టింగ్‌కి వెళ్లి సైడ్-బై-సైడ్ వ్యూస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ప్రస్తుతానికి, దీని చివరి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందనే సమాచారం వెల్లడించలేదు. WhatsApp తాజాగా నాలుగు డివైజెస్ లింక్‌ల అప్ డేట్ విడుదల చేసింది, దింతో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఒకే అకౌంట్ తో నాలుగు వేర్వేరు ఫోన్‌లలో ఉపయోగించవచ్చని తెలిపింది.