గూగుల్ మీట్ యూజర్లు ఇప్పుడు 1080p వీడియో కాలింగ్ అప్షన్ ఉపయోగించుకోవచ్చని ఇంకా ఫుల్ HD వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
గూగుల్ వీడియో కాలింగ్ సర్వీస్ Google Meet కోసం ఫుల్ HD వీడియో కాలింగ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇందుకు కంపెనీ Google Meet కోసం కొత్త అప్‌డేట్‌ను కూడా ప్రవేశపెట్టింది, దింతో యూజర్లు ఇప్పుడు 1080p వద్ద వీడియో కాల్‌లు చేసుకునే అవకాశాన్ని పొందుతారు.
హై క్వాలిటీ వీడియో కాల్స్
Google Meet యూజర్లు ఇప్పుడు 1080p వీడియో కాలింగ్ అప్షన్ ఉపయోగించుకోవచ్చని ఇంకా ఫుల్ HD వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు ఇది 720 పిక్సెల్‌లకు లిమిట్ చేయబడింది. అయితే, దీని కోసం మీ PC ఫుల్ HD రిజల్యూషన్‌తో కూడిన కెమెరా కలిగి ఉండాలి. ఈ ఫీచర్ వెబ్‌లో Google Meet కోసం మాత్రమే పరిచయం చేసింది.
undefined
Google బ్లాగ్ పోస్ట్ ప్రకారం, యూజర్లు ఇప్పుడు Google Meet సెట్టింగ్‌ల మెనులో వీడియో క్వాలిటీ 1080pకి సెట్ చేసుకోవచ్చు. ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్ చేయబడుతుంది అయితే మీటింగ్‌లో చేరడానికి ముందు దాన్ని ఆన్ చేయవచ్చు. మీటింగ్‌లో ఫీచర్‌ను ఉపయోగించడానికి యూజర్లు తప్పనిసరిగా 1080p కెమెరాతో కూడిన కంప్యూటర్, తగినంత కంప్యూటింగ్ శక్తిని ఉండాలని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
Google Meetలో 1080p వీడియో అప్షన్ ప్రస్తుతం Google Workspaces పేమెంట్ యూజర్లకు అందుబాటులో ఉంది, ఇందులో Google Workspace Business Standard, Business Plus, Enterprise Starter, Enterprise Standard, Enterprise Plus ఇంకా ఇతర ఉన్నాయి. 2TB లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజ్ స్పెస్ ఉన్న Google One సభ్యులు కూడా ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.
Google Workspace Essentials, Business Standard, Education Fundamentals, Frontline, Nonprofit, G Shoots Basic ఇంకా బిజినెస్ యూజర్‌లతో పాటు పర్సనల్ Google అకౌంట్ ఉన్న వారికి కొత్త ఫీచర్ అందుబాటులో లేదు.