ఆపిల్ కంపెనీకి చెందిన ఆపిల్ హైడ్రేట్‌స్పార్క్ అనేది ఆపిల్ యూఎస్ స్టోర్‌లో 59.95 డాలర్లకి లేదా దాదాపు రూ. 4,600కి లిస్ట్ చేసిన వాటర్ బాటిల్.
ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఆపిల్ (Apple)ఉత్పత్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ Appleలో కూడా ఇలాంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయని మీకు తెలుసా, దీనిని Apple సంస్థ తయారు చేసిందంటే మీరు నమ్మలేరు. ఆపిల్ ప్రత్యేకమైన ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు యాపిల్ స్మార్ట్ బాటిల్‌ను విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంతకుముందు యాపిల్ రూ.1,900కి ఫోన్ కోసం క్లీనింగ్ క్లాత్‌ను విడుదల చేసింది. ఆపిల్ ఈ ప్రత్యేక బాటిల్‌కు హైడ్రేట్‌స్పార్క్ అని పేరు పెట్టింది.
ఆపిల్ సంస్థాకి చెందిన ఆపిల్ హైడ్రేట్‌స్పార్క్ అనేది ఆపిల్ యూఎస్ స్టోర్‌లో $ 59.95 లేదా దాదాపు రూ. 4,600కి లిస్ట్ చేసిన వాటర్ బాటిల్. ప్రస్తుతం, ఈ బాటిల్ యూఎస్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది, అయితే ఇతర మార్కెట్‌లలో దీని లభ్యత గురించి ఎటువంటి సమాచారం లేదు.
undefined
ఆపిల్ హైడ్రేట్‌స్పార్క్ కి బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నందున దీనిని స్మార్ట్ బాటిల్ అని పిలుస్తారు. ఈ బాటిల్ మీరు తాగే అలవాట్లను పర్యవేక్షిస్తుంది ఇంకా iPhoneలోని ఆపిల్ హెల్త్ యాప్‌కి డేటాను పంపుతుంది.
ఆపిల్ హైడ్రేట్‌స్పార్క్ ని రెండు వేరియంట్లలో పరిచయం చేసారు. మొదటి వేరియంట్ హైడ్రేట్‌స్పార్క్ ప్రొ, రెండవ వేరియంట్ హైడ్రేట్‌స్పార్క్ ప్రొ స్టీల్. మొదటి వేరియంట్ ధర వరుసగా $59.95, రెండవ వేరియంట్ ధర $79.95.
హైడ్రేట్‌స్పార్క్ ప్రొ స్టీల్ రెండు రంగులలో లభిస్తుంది - సిల్వర్ అండ్ బ్లాక్. ఈ బాటిల్ లో ఎల్‌ఈడి సెన్సార్ కూడా ఉంది, దానితో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే బాటిల్ వాటర్ తాగాలని ఫోన్ లో అలర్ట్ లను పంపుతుంది. HidrateSpark Pro గత వేరియంట్‌ల వంటి ఫీచర్లతో నలుపు , ఆకుపచ్చ రంగులలో కొనుగోలు చేయవచ్చు.