ఇప్పుడు గూగుల్ మీ ఆర్డర్‌పై మీ పర్సనల్ సమాచారాన్ని అందులో నుండి డిలెట్ చేస్తుంది..ఇలా చేయండి..

By asianet news telugu  |  First Published Apr 29, 2022, 1:58 PM IST

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త పాలసీ విడుదల చేసింది, దీని ప్రకారం యూజర్లు Google ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఆన్‌లైన్ పర్సనల్ వివరాలను తొలగించే అవకాశాన్ని పొందుతారు. 


Google సెర్చ్ ఫలితాల్లో మీ సమాచారం వస్తోందని మీరు ఆందోళన చెందుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు Googleని అడగడం ద్వారా సెర్చ్ ఫలితాల నుండి మీ సమాచారాన్ని తీసివేయవచ్చు. ఇందుకు Google కొత్త విధానాన్ని విడుదల చేసింది, దీని ప్రకారం వినియోగదారులు Google ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఆన్‌లైన్ పర్సనల్ వివరాలను తొలగించే అవకాశాన్ని పొందుతారు. ఉదాహరణకు, Google సెర్చ్ ఫలితాల్లో మీ ఫోటో, ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ వస్తే మీరు వాటిని తీసివేయవచ్చు.

కొత్త పాలసీకి సంబంధించి, Google పాలసీ హెడ్ మిచెల్ చాంగ్ మాట్లాడుతూ, మీరు Googleలో మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా లేదా ఇంటి అడ్రస్ సెర్చ్ చేసినప్పుడు, మీ గోప్యతకు సంబధించి సమాచారం వస్తే

Latest Videos

undefined

ఇప్పుడు అటువంటి సమాచారాన్ని తీసివేయడానికి Google ద్వారా ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది. అలాగే, మీకు హాని కలిగించే లేదా మీకు మోసం జరిగే అవకాశం ఉన్న సమాచారాన్ని మాత్రమే Google తీసివేస్తుంది.

మీరు Google నుండి మీ సమాచారాన్ని తీసివేయాలనుకుంటే, మీరు Google హెల్ప్‌లైన్ ఇమెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Google సమీక్షిస్తుంది ఇంకా మీ సమాచారం తీసివేయబడుతుంది, అయితే ఈ సమాచారం Google కాకుండా మరేదైనా ప్లాట్‌ఫారమ్‌లో కూడా  ఉండవచ్చు.
 

click me!