ఆపిల్ ఐఫోన్ కేవలం రూ.9,140కే.. ! ఎక్కడ, ఎలా కొనుగోలు చేయాలంటే.. ?

ఆపిల్ ఐఫోన్ 11 రూ.2,701 ధర తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.41,199కి విక్రయిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 

Google News Follow Us

ఈ సమ్మర్ లో ఈ-కామర్స్ దిగ్గజం కూల్ అఫర్ తో వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అతధికంగా ఇష్టపడే ఆపిల్ ఐఫోన్ 11 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపులతో లభిస్తుంది. దీనిని రూ.64,900 ప్రారంభ ధరతో 2019లో భారతదేశంలో ప్రవేశపెట్టిన  Apple iPhone 11 మొబైల్ ఫోన్ 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

ఇది కూడా అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ మోడల్‌లలో ఒకటి. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 11ని నిలిపివేసింది. అయితే, ఐఫోన్ 11 మొబైల్ మంచి కెమెరాతో కూడిన సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్.

iPhone 11 అనేది Apple iPhone 11 సిరీస్  ప్రైమరీ మోడల్. ఈ లైనప్‌లో iPhone 11 Pro, iPhone 11 Pro Max కూడా ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 11 ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో సేల్స్ ద్వారా  అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 11 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 34,760 తగ్గింపుతో కేవలం రూ. 9,140కి అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 11 రూ.2,701 ధర తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.41,199కి విక్రయిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతో ధర రూ.39,140కి తగ్గింది. ఇది కాకుండా, మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను రీడీమ్ చేస్తే రూ.30,000 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

ఆ విధంగా రూ.34,760 తగ్గింపు తర్వాత, మీరు ఆపిల్ ఐఫోన్ 11 మొబైల్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కేవలం రూ.9,140కి కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 11కి 6.1 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. A13 బయోనిక్ చిప్‌సెట్ తో  ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఐఫోన్లలో ఇది ఒకటి. ఇది 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా గౌరవానికి అర్హమైనది. వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.