గర్ల్ ఫ్రెండ్ లారెన్ శాంచెజ్‌తో అమెజాన్ వ్యవస్థాపకుడి నిశ్చితార్థం: నివేదిక

జెఫ్ బెజోస్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అయితే బెజోస్ మొదటి భార్య మెకెంజీ స్కాట్ నుండి విడాకులు తీసుకునే వరకు ఇద్దరూ ఈ విషయాన్ని తక్కువ ప్రొఫైల్‌లో ఉంచారు. బెజోస్ అండ్ మెకెంజీకి నలుగురు పిల్లలు.
 
Amazon Founder Jeff Bezos Engaged To Girlfriend Lauren Sanchez: Report-sak

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అతని స్నేహితురాలు లారెన్ శాంచెజ్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. విదేశీ మీడియా వర్గాలు  ఈ సమాచారం ఇచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, జెఫ్ బెజోస్ అతని స్నేహితురాలు లారెన్ శాంచెజ్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని చాలా నెలలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. 

జెఫ్ బెజోస్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. అయితే బెజోస్ మొదటి భార్య మెకెంజీ స్కాట్ నుండి విడాకులు తీసుకునే వరకు ఇద్దరూ ఈ విషయాన్ని తక్కువ ప్రొఫైల్‌లో ఉంచారు. బెజోస్ అండ్ మెకెంజీకి నలుగురు పిల్లలు.

Latest Videos

విడాకుల ద్వారా మెకెంజీ $38 బిలియన్లను అందుకున్నారు, అందులో సగం దాతృత్వానికి విరాళంగా ఇస్తానని వాగ్దానం చేశారు. విడాకుల సెటిల్‌మెంట్‌లోని డబ్బు మెకెంజీని ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న మహిళగా చేసింది.  

లారెన్ శాంచెజ్ ఎంటర్‌టైన్‌మెంట్ రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. మరోవైపు, లారెన్ శాంచెజ్ నవంబర్ 2022లో బ్లూ ఆరిజిన్ వ్యవస్థాపకుడి అడుగుజాడలను అనుసరించాలని, అంతరిక్షంలోకి ప్రయాణించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
 
vuukle one pixel image
click me!