హాలీవుడ్ సినిమాల్లోనే కాదు, ఇది నిజం; టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ల్యాప్‌టాప్...

By Ashok kumar Sandra  |  First Published Feb 28, 2024, 7:21 PM IST

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ప్రస్తుత ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతున్నాయి. అయితే Lenovo ఇంకా ఏ ఇతర ఫీచర్లను విడుదల చేయలేదు. 


బార్సిలోనా: ఎట్టకేలకు లెనోవో పారదర్శకమైన(transparent ) డిస్‌ప్లేతో కూడిన ప్రపంచంలోనే తొలి ల్యాప్‌టాప్‌ను టెక్నాలజీ ప్రపంచం ముందు ప్రవేశపెట్టింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లెనోవా థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే అనే మోడల్‌ను పరిచయం చేసింది. 

దీని స్క్రీన్ సైజ్ 17.3 అంగుళాలు. పారదర్శకత 55 శాతం వరకు ఉంటుంది. దీనికి కంపెనీ 720p రిజల్యూషన్‌తో కూడిన మైక్రో LED స్క్రీన్‌ను అందించింది. కీబోర్డ్‌లో పారదర్శకమైన భాగం కూడా అందించబడింది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్ (AIGC) టెక్నాలజీని కూడా అందించారు. దీన్ని ఓ కాన్సెప్ట్‌గా కంపెనీ ప్రవేశపెట్టింది. ల్యాప్‌టాప్ ఛాసిస్‌లో కెమెరా అందించారు.

Latest Videos

సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ప్రస్తుత ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 ఓఎస్‌తో రన్ అవుతూ ఉన్నాయి. Lenovo ఇంకా దీనికి సంబంధించి  ఏ ఇతర ఫీచర్లను విడుదల చేయలేదు. పారదర్శక కీబోర్డ్‌గా ఉండటం వల్ల దీనిని స్కెచ్ ప్యాడ్‌గా కూడా ఉపయోగించవచ్చు. సమస్య ఏమిటంటే, మీరు సాధారణ కీబోర్డ్‌లో టైప్ చేసే అనుభవాన్ని పొందలేరు.

థింక్‌బుక్ పారదర్శక డిస్‌ప్లే మైక్రో ఎల్‌ఈడీ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసినట్లు లెనోవా ధృవీకరించింది. డిస్‌ప్లే ఇండోర్ అండ్ అవుట్‌డోర్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. డివైజ్  బెజెల్-లెస్ డిజైన్‌తో  ఉంది. 

అయితే, పారదర్శక డిజైన్ భావన కొత్తది కాదు. ఇంతకు ముందు ఎన్నో కాన్సెప్ట్ డిజైన్‌లను కంపెనీలు తెరపైకి తెచ్చాయి. రాబోయే రోజుల్లో పారదర్శక స్క్రీన్‌లతో కూడిన అనేక డివైజెస్ మనం చూడబోతున్నాం...  

Lenovo స్వయంగా మొదటి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ (థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్) వంటి కంప్యూటింగ్ డివైజెస్ ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి టెక్ షోలలో దృష్టిని ఆకర్షించిన లెనోవో.. గత ఏడాది రోల్ చేయగల ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ ల్యాప్‌టాప్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు.
 

click me!